Deputy CM Pwan syas sorry to govern
YCP చేసిన తప్పులకు మా తప్పు లేకున్నా మేము క్షమాపణ కోరుతున్నాం గౌవెర్నర్ గారు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే YCP నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. MLAలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. YCP నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.ఇప్పటికే వైసిపి నేతలు తమకు ప్రతి పక్ష హోద కావాలని అసెంబ్లీ లో రచ్చ చేస్తున్న విషయం.తెలిసింది దీన్ని పరిగణం లోకి తీసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసిపి కి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి.జనసేనకు 21 సీట్లు వచ్చాయి.కనీసం ప్రతి పక్ష హోదకి కావలసిన సీట్లు కూడా రాని వైసిపి కి ప్రతి పక్ష హోదా ఎలా ఇస్తాం అని పవన్ అన్నారు.జన సెనకి మాత్రమే ప్రతి పక్షా హోదా తీసుకునే అధికారం ఉందని అన్నారు.
మరోవైపు ప్రమాణ స్వీకారానికి తప్ప ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి సభ్యత్వం రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.YCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని BJP నేత సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ‘ప్రతిపక్షంలో YCP మాత్రమే ఉంది. అసెంబ్లీలో తక్కువ మంది MLAలు ఉన్నప్పటికీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాల్సిందే’ అని అభిప్రాయపడ్డారు. తిరుపతి Dy. మేయర్ ఉపఎన్నిక సందర్భంగా ప్రజాప్రతినిధులపై కొందరు దాడులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. దీనిపై హైకోర్టులో తాను దాఖలు చేసిన పిల్ MAR12న విచారణకు రానుందని తెలిపారు.