Pindi Nalli Nivarana: పిండి నల్లి నివారణ చెర్యలు – 2024

Table of Contents

Pindi Nalli Nivarana:  పిండి నల్లి నివారణ చెర్యలు

పంట దిగుబడిని తగ్గించి రైతుకు అధిక సంఖ్యలో దిగుబడిని తగ్గించే కీటకం ఐన పిండి నాలిని ఎలా నివారించాలి అనేదాని గురించి ఒకసారి చూద్దాం…

పిండి నల్లి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు అలాగే ఇది పంటలను ఎంతవరకు నాశనం చేస్తుందో కూడా మనకు తెలుసు ఇది ఎక్కువగా కూరగాయలు మరియు పండ్ల తోటల్లో కనిపిస్తూ ఉంటుంది దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పారా కొక్కస్ మరిగినట్స్.ఇది సూడో కాక్సిడే కుటుంబానికి చెందినది.ఈ పురుగు మాములుగా మొక్క యొక్క లేత ఇగురు నుంచి లేదా పండు లేదా కాయ యొక్క ఇగురు నుంచి రసాన్ని పీల్చి పంటకు బలాన్ని చేకూర్చకుండా …మొత్తం ప్రోటీన్ ను ఇదే పీల్చుకొని రైతులకు అధిక మొత్తంలో నష్టాన్ని చేస్కురుస్తూ ఉంటుంది.కాబట్టి రైతు లు ప్రతి ఒక్కరు ఈ పురుగుల గురించి తెలుసుకొని అప్రమత్తం అయ్యే దాని నివారణకు సంబంధించిన చర్యలను చేపడితేయ్ పంట చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఈ పిండి నల్లి దశలు ఎన్ని
ఈ పిండి నల్లి అనే పురుగు మూడు దశల్లో ఐతే ఉంటుంది.అవి

  • గుడ్డు దశ
  • పిల్ల పురుగు దశ
  • తల్లి పురుగు దశ

గుడ్డు దశ

పిండి నల్లి ఆడ పురుగులు మగపురుగులతో పరాగసంపర్కుహం జరిగిన తరువాత గుడ్లను చెట్టు యొక్క కాండం (వేరు మొదట్లో ) పెట్టడం జరుగుతుంది.ఈ గుడ్లు ముఖ్యంగా కాషాయం మరియు తెలుపు రంగులో ఉంది కోడి గుడ్డు లాంటి ఆకారంలో భోమిలో పెట్టబడి ఉంటుంది.ఈ దశలో తల్లి పురుగు గుడ్డు పెట్టిన 24 గంటల్లో పిల్ల పురుగు గుడ్డు నుండి బయటికి రావడం జరుగుతుంది.

పిల్ల పురుగు దశ

పిల్ల పురుగు మల్లి మూడు దశల ద్వారా తల్లి పురుగుగా మారడం జరుగుతుంది పిల్ల పురుగుగా మారిన 15 రోజుల్లోపు మూడు దశలను పూర్తి చేసుకొని పిల్ల పురుగు కాస్త తల్లి పురుగుగా మారడం జరుగుంతుంది.ఈ మూడు దశలను పూర్తి చేసుకోవడం కోసం పిల్ల పురుగు మెల్లిగా మొక్క యొక్క పై భాగానికి పిల్ల పురుగు చేరుకుంటుంది.పిల్ల పురుగు తన చుట్టూ ఒక ప్రత్యేకమైన షెల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎండా,వాన తాకిడిని తట్టుకొని నిలబడుతుంది.

తల్లి పురుగు

పిల్ల పురుగు నుండి తల్లి పురుగుగా మారిన పిండి నల్లి మొక్క యొక్క లేత చిగురు ఆకులను మరియు కాయ యొక్క రసాన్ని పీల్చి మొగ్గ రాలిపోవడం లేదా ఆకు రాలిపోవడం లాంటి లక్షణాలను చూపెడుతుంది.తీయటి చిక్కటి ద్రవాన్ని మొక్కపై వెదజల్లుతూ చీమలను ఆకర్షిస్తుంది.మరి వీటిని ఎలా నివారించాలి అనేది చూద్దాం

జీవ పద్దతి

పిండి నల్లి అనే పురుగును జీవ ఎరువుల పద్దతిని ఉపయోగించి నివారించవచ్చు.

  • మొదటగా కొంత పుల్లగా ఉన్న మాజీగాను తీసుకోవాలి.
  • అందులో పసుపును కలుపుకోవాలి
  • 1 లీటర్ ద్రావణాన్ని గాను పది లీటర్ల నీటిని కలుపుకొని
  • 2 రోజులకు ఒకసారి పిచికారీ చేయవలసి ఉంటుంది.

2.

  • ఆ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని సీసాలో లేదా ఒక డబ్బాలో తీసుకొని ఒక లీటరు నీటిని కలిపి 7 రోజులు పులియబెట్టిలి.
  • పులియబెట్టిన అన్నాన్ని ఒక కర్రతో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రోజుకి ఒక్కసారి తిప్పాలి ఇప్పుడు అన్నం లోని సారం అంతా నీటిలోకి దిగుతుంది
  • వారం రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసుకొని 1:1 లేదా 1:2 లో నీటిని మరియు ఒక చెంచా వెజిటేబుల్ నూనెను కలిపి పిండి నల్లి సోకిన
  • మొక్కల పై చల్లాలి. పిండినల్లి తీవ్రతను బట్టి వారానికి ఒకసారి మనం ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి.

 

Leave a Comment