ప్రతీపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్న మంత్రి /Oppositions Doing Dirty Politics on SLBC Tunne 2025

Oppositions Doing Dirty Politics on SLBC Tunne

SLBC టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై త్వరలో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా టన్నెల్ 14kms వద్ద ప్రమాదం జరగగా, రెస్క్యూ బృందాలు 13.7kms వరకు చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

శ్రీశైలం.ఎడమ కాలువలో ప్రమాదం జరిగి ఇప్పటికే 3 రోజులు అవుతున్న కూడా రెస్క్యూ టీం తన పనిని కొనసాగిస్తున్న వుంది.ఇప్పటికే ఈ రీసెర్చ్ లో ఉత్తరాఖండ్ , ఎన్డీఆర్ఎఫ్,ఇండియన్ ఆర్మీ తెలంగాణ హైడ్ర పనులు చేస్తున్న ఇంతవరకు ఆచూకీ దొరకలేదు.అతి ఎక్కువగా మట్టి నుండి వాటర్ వస్తుండడంతో నీటిని బయటకు తొడేస్తూ రెస్క్యూ చేస్తున్నారు.ఇప్పటికే బ్రతికే వున్నారని ఆశతో ఈ కొనసాగింపు చర్యలు కొనసాగిస్తున్న ఉన్నారు సిబ్బంది. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం అడిగి తెలుసుకుంటున్నారు.ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా వారి ఉన్న ఆచూకీని కనిపెట్టలని దానికి సంబంధించి పూర్తి సహకారాలు మేము అందిస్తాం అని ప్రధాని మోడీ ఫోన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.

Leave a Comment