KTR Fire On Revanth Reddy And Hydra: డబ్బున్నోడికి ఓ న్యాయం పేదోడికి ఓ న్యాయమాయే ఈ ప్రభుత్వంలా 2024
హైడ్రాపై మాజీ ఐటీ మినిస్టర్ తారక రామారావు ఫైర్ అవడం జరిగింది. పేదలకు ఓ న్యాయం డబ్బున్నోడికి ఓ న్యాయమా అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైడ్రో పేరుతో ఎన్నో రకాల ఇండస్ట్రీస్ ని మరియు పేదలను ఇళ్లను కూడా కూల్చి వేస్తూ వస్తోంది ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చి ఇండ్లను కూలగొట్టడంపై ఆయన ధ్వజమెత్తారు ఇది మూర్ఖపు పాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు అలాగే హైట్ కమిషనర్ రంగనాథన్ పై కూడా కేటీఆర్ ఫైర్ అవడం జరిగింది. హైడ్రా పేరుతో కూలగొడుతున్న ఇండ్లపై ఆయన మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారో రాత్రికి రాత్రికి కూల్ చేస్తే వారు ఎక్కడికైనా వెళ్తారు అంటూ ఆయన ధ్వజమెత్తారు.
ప్రజా పాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల హింసలకు దారితీస్తుందని తెలిపారు. పిల్లలు బుక్కులు తీసుకుంటాం మా బుక్కులు ఉన్నాయి అని అన్నా కూడా ఏమాత్రం కనికరం లేకుండా హైడ్రా చేసిన పని సిగ్గుచేటు అని అన్నారు.డబ్బు ఉన్నోడికి ఒక రకంగా డబ్బు లేనోడికి ఒక రకంగా చూడడం ప్రభుత్వం మూర్ఖపు వైఖరితనమని సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. సీఎం మీ అన్న యనమల తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఎఫ్డిఎల్ పరిధిలోని ఉందని తనకు మాత్రం ఎందుకు నోటీసులు ఇచ్చారని నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చలేదని అన్నారు.
అదే డబ్బున్నోళ్లకు నోటీసులు ఇచ్చి ఇల్లు కూలగొడతారా గరీబోడికి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఇళ్లను కులగోడతారా తిరుపతిరెడ్డికి నోటీసులు ఇవ్వగానే ఆయనే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నాడు అని అడిగారు. పిల్లలు మా బుక్కులు ఉన్నాయి మా బ్యాగులు ఉన్నాయి మేము వెళ్లి తెచ్చుకుంటాం అని అన్నా కూడా ఏ మాత్రం వినిపించుకోకుండా రాతకి రాత్రి బుల్డోజర్లను తెప్పించి అలా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ఆయన అన్నారు.ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు సంవత్సరం కావస్తున్నా కూడా ఎందుకు ఒక ఇల్లు కూడా కట్టలేదని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా రిజిలక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఏ పేదోనికి ఇవ్వలేదని ఒక్క రూపాయి ఇవ్వక పోగా లక్షల్లో ఇళ్ళను కూలగొడుతూ బిల్డర్ ల పేర్లు చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి లంచాలు వసూలు చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు హైడ్రా గురించి అది చేసే పనుల గురించి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరి నలుగురు బిల్డర్ల పేర్లు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు అంతేకాకుండా బిల్డర్ లతో మీరు కుంభకై ఇంకా ఎన్ని ఇళ్లను కూలగొడతారో అని ప్రశ్నించారు.