KTR fire on CM Revanth Reddy for Development
రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ
ఒక్క ఏడాదిలోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పు చేసి ఏం పీకినవ్ రేవంత్
తెలంగాణ భవన్ ఇక నుంచి తెలంగాణ జనతా గ్యారేజ్
తెలంగాణ భవన్ ఇక నుంచి తెలంగాణ జనతా గ్యారేజ్ అని, ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందని, కార్మికులను కేసీఆర్ పట్టించుకున్నట్లు ఇంకెవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.
సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు BRS ప్రకటించింది. ఈ కమిటీ సభ్యులు 2 వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేస్తారని తెలిపింది. అధ్య యనం అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని, బడ్జెట్ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని KTR పేర్కొన్నారు.
ఒక్క ఏడాదిలోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పు చేసి ఏం పీకినవ్ రేవంత్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఒక కొత్త ఇటుక పెట్టినవా? ఒక కొత్త పైప్లాన్ వేసినవా? ఒక కాల్వ తవ్వినవా? ఒక కార్మికుడికి లాభం తెచ్చావా? ఒక ఆడబిడ్డకు రూ.2,500 ఇచ్చావా? నీ కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి మాత్రం మూటలు మోస్తున్నావ్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం రేవంత్కు చుక్కలు చూపెట్టే వాళ్లు ముందుకు రావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. కేసులకు భయపడే వాళ్లు నాయకులు కాదని, ఎవరిపై ఎక్కువ కేసులు అయితే వారే పెద్ద నాయకులు అవుతారని చెప్పారు. ‘పోయింది అధికారం మాత్రమే. పోరాట పటిమ కాదు. ఇచ్చిన హామీలపై నిలదీస్తూ ఈ నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టాలి’ అని బీఆర్ఎస్ కార్మిక విభాగానికి దిశానిర్దేశం చేశారు.
కార్మికుల తరఫున సంస్థలతో, ప్రభుత్వంతో పోరాడతామని KTR భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్లో BRS కార్మిక విభాగం క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆయన వారికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ భవన్ ఇక నుంచి తెలంగాణ జనతా గ్యారేజ్ అని, ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందని, కార్మికులను కేసీఆర్ పట్టించుకున్నట్లు ఇంకెవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.