ICFRE Latest Job Notification 2025| Latest Notifications |Govt Notifications 2025| Telangana Jobs
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబందించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ డిపార్ట్మెంట్ (ICFRE) నుండి 02 జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను 10th జనవరి 2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. దీని కోసం అభ్యర్థులు బొటనీ లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ లో BSC లేదా MSC చేసి ఉండాలి.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
అటవీ శాఖ ICFRE – IFB డిపార్ట్మెంట్ నుండి 02 ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. బొటనీ లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ లో BSC లేదా MSC చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
జీతం:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹19,000/- నుండి ₹24,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఎంత:
దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
అటవీ శాఖ ఉద్యోగాల వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST లకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సదలిమౌ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
హైదరాబాద్ లోని ICFRE – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 10th జనవరి 2025 న హైదరాబాద్ లోని దూలపల్లి, కొంపల్లి లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. అర్హతలు కలిగినవారు హాజరుకాగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 10th న రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష, ఫీజు ఏమీ లేదు. మెరిట్ మార్కులు ఉంటే చాలు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
- BSC, MSC అర్హత సర్టిఫికెట్స్, 10th మార్క్స్ లిస్ట్
- స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
అటవీ శాఖ ఉద్యోగాల వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
FAQ