Harish Rao Fire On AP CM Chandra Babu Naidu
సీఎం చంద్రబాబు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ నాడు ఆయన మా కాళేశ్వరంపైన అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు అంటున్నారు కానీ నేను సాక్షాదారాలతో సహా బయట పెట్టాలి అని అనుకుంటున్నాను.
రైతు ప్రస్థానం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాజెక్ట్ ఐన కాళేశ్వరం పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సాక్షాదారాలతో సహా బయట పెడతా అని అన్నారు.ఆయన కాళేశ్వరం పనులను అడ్డుకోలేదు అని అంటున్నారు కదా అప్పటి సీఎం ఐన చంద్రబాబు నాయుడు గారు మరి కాళేశ్వరం కట్టడం పై తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నాం అని కేంద్రానికి లేఖ ఎందుకు రాసారు అని అన్నారు.
లంగాణ మీరు కాలేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము ఒకటి రెండవది ఏమంటున్నారు ఇందులో మీరు కాలేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాలేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ నం ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు వీరి పేరు మీద బంకచర్ల గోదావరి ప్రాజెక్టు మీద 200 టిఎంసి ల తీసుకుపోదమ్మని చూస్తున్నారు.