Free Gas Cylinders Bookings Open: ఈ నెల 31 నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

Free Gas Cylinders Bookings Open: ఈ నెల 31 నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది.

ఆంధ్రప్రదేశ్ కూటమి (ఎన్డిఏ) ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ వస్తుంది. మొట్టమొదటి పథకంగా ఉచిత గ్యాస్ సిలిండర్ను అయితే అమలు చేయడానికి అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దీనికోసం అని రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్ల వరకు అయితే వెచ్చించనుంది. నాలుగు నెలల చొప్పున సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మహిళల పేరు మీద అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని విధి విధానాలను పూర్తి చేసినట్టు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది.

ఈనెల 29వ తారీకు నుంచి కొత్త గ్యాస్ సిలిండర్లా బుకింగ్ జరుగుతూ ఉందని 31 వ తారీకు నుంచి గ్యాస్ సిలిండలను డెలివరీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలపడం జరిగింది. గ్యాస్ ఏజెన్సీల తో జరిగిన మీటింగ్లో వారు చెప్పిన విషయం ఏంటంటే పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ట్రావెలింగ్ లేట్ అవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి వారికి 48 గంటల్లో అయితే డెలివరీ చేస్తామని చెప్పారు.

ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈనెల 29 నుంచి గ్యాస్ సిలిండర్లా బుకింగ్ ప్రక్రియ జరుగుతుంది అని 31 వ తారీకుకి గ్యాస్ సిలిండలను పంపిణీ చేస్తామని అన్నారు. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవ్వగానే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మెసేజ్ వెళ్తుందని అన్నారు ఆ మెసేజ్ వెళ్లిన వారికి 24 గంటల నుంచి 48 గంటల్లోగా గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుందని అన్నారు.ఈ గ్యాస్ ను పొందాలంటే ముందు గ్యాస్ సిలిండర్ ధరను పట్టి మహిళలు డబ్బును కట్టాలని గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 248 గంటల్లో మహిళల ఖాతాలో డబ్బు జమ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే మహిళలు గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ముందే గ్యాస్ సిలిండర్ కి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది ఆ తర్వాత సబ్సిడీ రూపంలో మహిళల ఖాతాలో సబ్సిడీ జమ చేయడం జరుగుతుందని అన్నారు.

ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ ధర rs.829 ప్రకారం 2000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఒకవేళ ఆయిల్ కంపెనీలో గ్యాస్ సిలిండర్ ధరను పెంచితే అదనంగా ఇంకా రాష్ట్రంపై భారం పడనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.అన్నదాత సుఖీభవ పై కూడా ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లేదా నవంబర్లో అన్నదాత సుఖీభవ విడుదల చేస్తామని అన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఇప్పుడిప్పుడే పడుతుందని కొంత మొత్తంలో బడ్జెట్ రెడీ చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీభవతో పాటు మిగిలిన పథకాలను విడుదల చేస్తామని అన్నారు.

Leave a Comment