Fertilizers cause of cancer to the farmers: కాన్సర్ ఉత్పత్తులను పెంచి పోషిస్తున్న రైతులు
కలుపు మందుల వల్ల క్యాన్సర్ కారకాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల రైతులు మరణిస్తున్నారని చెబుతున్న నిపుణులు.
ఒకప్పుడు దేశంలో రైతన్నలు అంటే కేవలం పశువుల పేడ జీవాల యొక్క వ్యర్థాలతో భూమికి జీవాన్ని మరియు బలాన్ని చేకూర్చేవారు కానీ ఇప్పుడున్న కాలంలో పాత పద్ధతులు ఏవి వాడకుండా అధిక దిగుబడి కోసం రైతులు రసాయని ఎరువులను వాడడం వల్ల భూమి సారం తగ్గడంతో పాటు రైతులకు నానారకాలుగా వ్యాధులకు గురవుతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం తింటున్న తిండి పూర్తిగా విషం అనే చెప్పాలి.
ఎందుకంటే ప్రతి ఒక్క పంట ఇంటికి వచ్చి ఆ ఇంటి నుంచి మన నోటికి వచ్చే వరకు ప్రతి సెకండ్ మందుల బారిన పడుతూ వస్తోంది ఇలా మందులు అతిగా వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్లు లంచ్ ఆన్సర్లు లాంటి క్యాన్సర్లు ఎక్కువగా అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు వీడికి సంబంధించి జీవో ఎవరు వాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో పథకాలను తీసుకువస్తూ ఉన్నాయి వీటి పథకాల వల్ల రైతులు రసాయనిక ఎరువులను వీడి ఆర్గానిక్ ఎరువులు వాడాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ కొత్త పథకాలను తీసుకొస్తూ ఉన్నారు.
అయినా కూడా కొంతమంది రైతులు ఆర్గానిక్ పద్ధతులను వాడకుండా రసాయనిక పద్ధతులను వాడి పంటలను అధికమవుతాదిలో పండించడం వల్ల ఆ రసాయనిక ఎరువులను వాడి రైతులు పంటలు పండించడం వల్ల చాలా రకాల వ్యాధులు మానవులను వెంటాడుతున్నాయి మానవులే కాకుండా జీవరాశులు కూడా ఆ వ్యాధుల బారిన పడుతున్నాయి కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తూ ఉన్నాయి.
అంతే స్థాయిలో రోజుకో రసాయనిక మందుల ఉత్పత్తి కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.ఒకరిని మించి మరొకటి అన్నట్లుగా దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించే విధంగా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి పరభుత్వం కూడా ఆ కంపెనీలు ఎలాంటి మందులను ఉత్పత్తి చేస్తున్నాయి అని చూడకుండా అభివృద్ధి పేరుతో పెర్మిషన్స్ ఇస్తూ వస్తున్నాయి.తప్పు ఎవరిది అనాలో కూడా తెలియని అయోమయం.రైతు వాడుతున్నాడు కాబట్టి రైతు ధీ అని అనాలా లేకా స్థాయికి మించి స్టీరావోయిడ్స్ ను కలిపి ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ పెర్సెంటేజీని పెంచి మందులను ఉత్పత్తి చేస్తున్న ఫర్టిలైజర్ కంపెనీలదా అనేది తెలియడం లేదు. దేశంలో రాను రాను మందుల కంపెనీలు ఎక్కువై మనుషులు తక్కువయ్యే పరిస్థితి నెలకొంటుందేమో …గత ఐదు సంవస్తారాల్లో మందులు పొలాలకు వాడిందానికన్నా మనుషులు వాడుకుందే ఎక్కువ ..అతివృష్టి ఏర్పడి పంట మొత్తం వరదల్లో కొట్టుకుపోయి అప్పులు కట్టలేక గడ్డి మందులు తాగి చనిపోయిన రైతులే ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి.
కాబట్టి రైతులు రసాయనిక మందులు వాడకుండా కేవలం ఇంటి వద్ద తయారు చేసుకున్న జీవ ఎరువులను వాడడం ద్వారా ఒక ఏడాది పంట నష్టం రావొచ్చు కానీ ఆ జీవ ఎరువు నిన్ను అప్పుల ఊబిలోకి లాగదు,రేవందవా సంవత్సరం నీకు అప్పు కానివ్వదు కానీ కొంత మేర లాభాలను తెచ్చిపెడుతుంది.శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ కార్పొరేట్ కంపెనీలు తయారు చేస్తన్న రసాయనిక మందులను వాడడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్స్,చర్మ సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్స్ వస్తున్నాయి అని శాత్రవేత్తలు కూడా చెబుతున్నారు కాబట్టి ఇకనైనా రైతులు రసాయనిక ఎరువులను వాడడం ఆపేయండి.