బుల్లితెర నటి ఫైమా రహస్య వివాహం: తొమ్మిదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు! | faima-marriage-with-praveen-nayak-jabardasth-faima-register-marriage 2026

faima-marriage-with-praveen-nayak-jabardasth-faima-register-marriage

‘పటాస్’, ‘జబర్దస్త్’ వంటి పాపులర్ కామెడీ షోల ద్వారా తెలుగు బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఫైమా. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే, ఫైమా కెరీర్ ఎంత సక్సెస్‌ఫుల్‌గా సాగిందో, ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువే వివాదాలు నడిచాయి. ప్రేమ పేరుతో ఆమె కొందరిని మోసం చేసిందంటూ గతంలో కొన్ని రూమర్స్ తెగ హల్‌చల్ చేశాయి.

ముఖ్యంగా జబర్దస్త్ సహ-నటుడు ప్రవీణ్‌తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ అప్పట్లో హాట్ టాపిక్. ఒక స్టేజ్ షోలో ప్రవీణ్ ఆమెకు ప్రపోజ్ చేయడం, ఫైమా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగాయి. కానీ, ఫైమా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరి బంధం బీటలు వారింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని ఫైమా చెబితే, ప్రవీణ్ మాత్రం తను మోసపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదాలను పక్కన పెట్టి ప్రవీణ్ ఇటీవలే వేరే అమ్మాయిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఫైమా: ఇప్పుడు ఫైమా కూడా పెళ్లి పీటలెక్కి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రవీణ్‌తో విడిపోయిన తర్వాత ఆమె ‘ప్రవీణ్ నాయక్’ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ జంట ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాద్‌లోని ఒక రిజిస్టర్ ఆఫీస్‌లో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

నిజానికి వీరి మధ్య దాదాపు తొమ్మిదేళ్లుగా సీక్రెట్ లవ్ స్టోరీ నడుస్తోందని సమాచారం. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ తట్టుకుని నిలబడి ఈ జంట ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఫైమా పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

Leave a Comment