Crop Loan Waiver 2024: రైతూ పంట రుణమాఫీ కోసం కొత్త ఆప్

Crop Loan Waiver 2024: రైతూ పంట రుణమాఫీ కోసం కొత్త ఆప్ 

Crop Loan Waiver 2024: రైతూ పంట రుణమాఫీ కోసం కొత్త ఆప్
Crop Loan Waiver 2024: రైతూ పంట రుణమాఫీ కోసం కొత్త ఆప్

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది ఇంతవరకు రుణమాఫీ కానీ రైతుల కోసం కొత్త మార్గదర్శకాలు అయితే ఇటీవల విడుదల చేసింది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక మరియు ఇతర కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆప్ను ప్రవేశపెట్టింది దీని పేరు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ దీనిని ఆదివారం రోజు లాంచ్ చేశారు. వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం అయితే లింకులను పంపించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఏ రైతుకు అయితే రుణమాఫీ జరగలేదు అని కంప్లైంట్ చేసి ఉంటారో ఆ రైతు ఇంటి వద్దకు వెళ్లి రైతుకు సంబంధించి సమాచారం అయితే సేకరించి ఈ యాప్ లో ఎంటర్ చేయనున్నారు. దీన్ని సోమవారం రోజు ట్రైలర్ రన్ చేసి ఆ తర్వాత మంగళవారం నుంచి పూర్తి అనేది మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రైతు

రుణమాఫీ జరగలేదు అంటూ రైతుల దగ్గర్నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆగ్రహలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది.

సర్వే ఎలా నిర్వహిస్తారు.

రైతు రుణమాఫీ కి సంబంధించి ఈ మంగళవారం నుంచి సర్వే అనేది మొదలుకానుంది మొదట ఈ సర్వేను ట్రైల్ రన్గా ఈరోజు రన్ చేయనున్నారు దాని తర్వాత అంటే మంగళవారం రోజు నుంచి ఇంటింటి సర్వే వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులు అయితే నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా ఏ రైతులకు అయితే రుణమాఫీ అనేది జరగలేదు ఆ రైతుల ఇంటి వద్దకు వెళ్లి రైతుల వివరాలను యాప్  అప్లోడ్ చేయడమే కాకుండా 18 ఏళ్లు పైబడి ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ఫోటో తీసుకొని యాప్ లో అప్లోడ్ చేయనున్నారు దీని ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు అని అధికారులు చెబుతున్నారు. గతంలో కుటుంబాన్ని గుర్తించకపోవడం వల్లే రైతులకు రుణమాఫీ జరగలేదు అంటూ అధికారులు చెబుతున్నారు.

2 లక్షల పైబడి రుణమాఫీ ఎప్పుడూ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ నేన్ జరిపిన తమకు రాలేదు అంటూ ఎంతోమంది రైతులు కంప్లైంట్ చేసిన విషయం తెలిసింది అయితే రెండు లక్షలకు పైబడి ఉన్నా రుణమాఫీని మాఫీ చేయాలి అంటే కచ్చితంగా వడ్డీ చెల్లించాలి అని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ వచ్చింది.రూ.2 లక్షలపైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయశాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఇప్పటి వరకు బ్యాంకులు రైత నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా.. తాజాగా స్పష్టతనిచ్చింది. అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది. వెల్లడించలేదు. దశలవారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగితే మళ్ళీ కొంతమంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది.

 

Leave a Comment