Court Movie Review in Telugu Pridarshi Nani
రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఈ సినిమా విజయవంతం కాకపోతే, ప్రేక్షకులు తన తదుపరి సినిమా ‘హిట్ 3’ చూడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
నాని సొంత బ్యానర్‌లో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించిన ‘కోర్ట్’ సినిమా. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఈ సినిమా విజయవంతం కాకపోతే, ప్రేక్షకులు తన తదుపరి సినిమా ‘హిట్ 3’ చూడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
పెద్దింటి అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)కీ పార్టమ్ ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతూ ఓ ఇంటి దగ్గర వాచ్మెన్గా పనిచేసే చందుకీ…మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ విషయం కాస్త జాబిలి ఇంట్లో తెలిసిపోతుంది. ఎప్పుడూ కుటుంబం పరువు, స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగపతి (శివాజీ) కోపంతో రగిలిపోతాడు. ఏం జరిగిందని వెనకా ముందు ఆలోచించకుండా పోక్సో చట్టంతోపాటు, ఇతర సెక్షనల్ మీద కేసు నమోదు చేస్తారు.ఏ తప్పూ చేయని చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? పేరు మోసిన న్యాయవాది మోహన్రావు (సాయికుమార్) దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ సూర్యతేజ అలియాస్ తేజ (ప్రియదర్శి) ఈ కేస్ని ఎలా భుజాన వేసుకున్నాడు? ఆ న్యాయ పోరాటం ఫలించిందా? లేదా అనేది తెరపైనే చూడాలి. 2013 నేపథ్యంలో సాగే కథ ఇది.
సినిమాలో మెయిన్ థీమ్, అలాగే టీనేజ్ లో పుట్టే తొలిప్రేమ తాలూకు కష్టనష్టాలు, ఇక పేదవాళ్ళకి ఈరోజుల్లో న్యాయం జరగడం లేదు’ అనే కోణం.. వీటి మధ్య మంగపతి లాంటి బలమైన పాత్రలు.. వాటి సంఘర్షణలు.. మొత్తంగా ఈ కోర్ట్ సినిమా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు శివాజీ నటన ప్రధాన బలం. మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. పారలెల్లి, జూనియర్ న్యాయవాది సూర్య తేజ (ప్రియదర్శి) మూడు సంవత్సరాలుగా స్వయంగా ఒక కేసును పరిష్కరించడానికి వేచి ఉన్నాడు.
తన తల్లితో అతని సంక్షిప్త సంభాషణ అతనిలో ఒక ముద్ర వేయాలనే కోరికను హైలైట్ చేయడానికి సరిపోతుంది.విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.