CM Revanth Reddy Good News: రైతులకు పై గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ ప్రభుత్వం
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింధీ.ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
CM Revanth Reddy Good News
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 500 రూపాయల వరి బోనస్‌ను ఈ సీజన్ నుంచే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు అయితే చేశాడు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నాళ్లకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్టు తెలిపాడు ఈ కరీఫ్ సీజన్ నుంచే బోనస్‌ను అందజేయాలని అధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సన్నలు పండించిన రైతులకు ఒక్కోకింటాకు 500 రూపాయలు బోనస్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఎంపిక చేసిన సన్నాలకు మాత్రమే భుజం ఇచ్చేటట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆంక్షలు విధించడం జరిగింది.ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా, అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సీజన్ లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది అని సీఎం తెలిపారు.
సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాబట్టి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడ ఎలాంటి తప్పు జరగకుండా చూసుకో వలసిన బాధ్యత ఆ జిల్లా కలెక్టర్లదైనని ఆయన స్పష్టం చేశారు తరుగు తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న వారిని ఉపేక్షించరాదని తెలిపారు ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ ఆ కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన బస్తాలపై కేంద్రంకి ఇచ్చిన నెంబరు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు
వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొనాలి.కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. సమస్యల పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈ కొనుగోలు ప్రక్రియ సవ్యంగా జరిగితే ఇదే ప్రక్రియను ప్రతి సారి అమలు చేస్తాం అని తెలిపారు.