Amaravathi New Railway Project Approved: 2245 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే పాజెక్ట్ ఆమోదించిన కేంద్రం
అమరావతికి కొత్త రైల్వే ప్రాజెక్ట్ను అప్రూవ్ చేసిన కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో పూర్తి చేయాలంటూ సీఎం కేంద్రానికి అభ్యర్థన.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి కొత్తగా రైల్వే ప్రాజెక్టు కావాలంటూ ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అడుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి వరకు రైల్వే లైను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. దీనికోసం మొత్తం రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను వెచ్చించి. 57 కిలోమీటర్లు మేరా విస్తరించి ఉన్న ఈ రైల్వే లైన్ కి కేంద్ర ప్రభుత్వం మూడు పాయింట్ రెండు (3.2) కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జిని కృష్ణా నదిపై అయితే నిర్మించనున్నట్లు తెలిపింది. కొత్తగా ఆమోదించిన ఈ రైల్వే లైన్ ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబం వరకూ వెళ్లనున్నట్టు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ అన్నారు. ఈ రైల్వే మార్గం మధ్యలో పెదపురం, చెన్నారావుపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొండపల్లి,వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం స్టేషన్లు ఉంటాయి.
కొత్త రైలు మార్గం అమరావతిని రైల్వే నెట్‌వర్క్‌లోకి తీసుకువస్తుంది అని అశ్విన్ వైశ్ణవ్ అన్నారు. ఈ కొత్త రైలు మార్గం గుంటూరు మీదుగా తెలంగాణలోని ఖమ్మం,వరంగల్ కాజీపేట,హైదరాబాద్, చెన్నై & కోల్‌కతాతో అమరావతికి ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ చేయనుంది.దక్షిణ భారతదేశంతో మధ్య మరియు ఉత్తర భారతదేశానికి మెరుగైన కనెక్టివిటీ ఈ రైల్వే మార్గం ద్వారా అందనుంది.
అమరలింగేశ్వర స్వామి ఆలయం, అమరావతి స్థూపం, ధ్యాన బుద్ధ విగ్రహం మరియు ఉండవల్లి గుహలు వంటి ధార్మిక ప్రదేశాలకు ప్రాప్యత కలవడమే కాకుండా ఈ ప్రదేశాలకు వెళ్లే వారికి సమయంతో పాటు డబ్బులు కూడా కలిసేస్తాయని రైల్వే మినిస్టర్ అన్నారు. ఈ రైల్వే లైన్ మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్ట్ మరియు కాకినాడ పోర్ట్ కలుపుకొని కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల పొడవు అంతేనా నిర్మాణం జరుగుతూ ఉంది. కృష్ణా నదిపై నిర్మించే వద్దను ఐకానిక్ పంతులుగా నిర్మించాలని కేంద్రాన్ని కోరారు.ప్రాజెక్ట్ పొడవు 57 కిమీ కాగా అంచనా వ్యయం రూ. 2,245 కోట్లు గా నిర్ధారించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా దాదాపు 19 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.గుంటూరు, కాజీపేట మార్గాల ద్వారా హైదరాబాద్, ముంబయి, బెంగుళూర్, కలకత్తా,చెన్నై, నాగపూర్ రైల్వే లైన్లతో అనుసంధానమవుతుంది.నాగపూర్ నుండి అటు నుంచి దిల్లీ వెళ్లే మార్గంతో అనుసంధానమవుతుంది.మొత్తంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనుసంధానం కానుంది.
ఈ ప్రాజెక్టు పొడవుతా 25 లక్షల చెట్లను నడవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా స్వచ్ఛమైన గారిని పొందవచ్చు అని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అన్నారు. మరియు ఎన్టీఆర్ జిల్లా పరిటాల వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ వస్తున్నట్టు తెలిపారు.కేంద్ర ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్రాజెక్టుపై కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు.10 రోజుల్లో ప్రాజెక్టును ఆమోదించారు. అలాగే ఈ ప్రాజెక్టును అంతే త్వరగా 3 ఏళ్లలోపు పూర్తి చేయాలని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ త్వరితగమననా పూర్తి చేస్తామని భూసేకరణ సహా అన్ని విషయాల్లో మా నుంచి పూర్తి సహకారం అందిస్తాం అని సిబిఎన్ అన్నారు.
సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్న…. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అందరం కలిసి పరిష్కరించామని ఈ నవంబర్ లేదా డిసెంబర్ లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నాయుడు.రాష్ట్రంలో 70వేల కోట్ల విలువైన రైల్వే లైన్ల పనులు జరుగుతున్నాయి అని హర్షం వ్యక్తం చేశారు.
అమరావతికి ఆమోదం తెలిపిన కొత్త రైల్వే జోన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ కొత్త ప్రాజెక్టు అమరావతికి ఎంతో అభివృద్ధి చేయడానికి దూదపడుతుందని ఆయన అన్నారు ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి సహకారం అందిస్తామని భూసేకరణ కూడా సేకరించి ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనిపై రామ్మోహన్ నాయుడు మరియు పురందేశ్వరి మాట్లాడుతూ ఇది ఎంతో లాభదాయకమైనదని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.