Telangana Rythu Bharosa Guidelines 2024 : రైతు భరోసా విధివిధానాలు ఖరారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా గురించి కీలక విషయాలను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాకు కావలసిన నిధులను ఎలా సమకూరుస్తారు అనేది వెల్లడించారు.
Telangana Rythu Bharosa Guidelines 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలక్షన్లో హామీలు ఇచ్చినటువంటి రైతు భరోసా 15 వేల రూపాయలను సంబంధించి కీలక అప్డేట్ అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను నేరుగా రైతుల ప్రాంతాలలో జమ చేస్తామని తెలిపారు దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివిధ విధానాలు కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఖరారు చేస్తామని తెలిపారు.
డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాల గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రకాల భూములకు పెద్ద భూములకు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటూ తెలిపారు అలాగే ఐదు ఎకరాలు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఈ రైతు భరోసా సీలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఒకవేళ 5 ఎకరాల వరకే రైతు భరోసా కనుక అందిస్తే దాదాపు లక్షల్లో రైతులకు రైతు భరోసా నిధులు జమ కాపోవచ్చు అని అయితే అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడంపై గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా, ఆదాయపు పన్ను చెల్లించే వారికి సాయం చేయడం సమంజసమా? అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగానే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న రైతులకు లేదా ఐదు ఎకరాలకు మించి భూములు ఉన్న రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు దీనివల్ల లక్షల్లో అయితే రైతులకు అన్యాయం జరగవచ్చు అనేది ప్రతిపక్షాల మాట.(Picture Meta AI)
ప్రభుత్వం రూపొందించే విధివిధానాల్లో సీలింగ్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు లేదా పది ఎకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్న మాట అంటే ఇప్పుడు వ్యవసాయంలో సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ ధ్యేయం దీనివల్ల కోట్లల్లో ధనం సేవ్ అవుతుంది అనేది రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశం.సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం యోచిస్తోంది.(Picture Meta AI)
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనేదిలను వాన కాలం ఖరీఫ్ పంటలనుంచే విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పటివరకు విధివిధానాలు ఖరారు కాకపోవడంతో యాసంగి నుంచి విడుదల చేస్తామని తెలిపింది ఇప్పుడు యాసంగిలో రెండు ఖరీఫ్ రవి పంటలకు కలిపి నిధులను విడుదల చేస్తారా లేదా ఒక్క యాసంగి సీజన్కు మాత్రమే డబ్బులు విడుదల చేస్తారా అనే దానిపై స్పష్టత అయితే రాలేదు కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏడు వేల రూపాయలను సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని గతంలో చెప్పారు.రైతు భరోసా పథకం విధివిధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియమించింది.ఈ కమిటీ ప్రభుత్వం వద్ద నివేదికను సమర్పించిన తరువాత, అసెంబ్లీలో చర్చించి, విధివిధానాలను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకంలో తీసుకురాబోయే మార్పుల గురించి రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. చిన్న, మధ్య తరహా రైతులకు పథకం మరింత ఉపయోగకరంగా మారుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.(Picture Meta AI)
FAQ