Jagadeesh Reddy fire on cm Revanth Reddy: తాను సీఎం అవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ను వాడుకున్నాడు 2024

Photo of author

By Admin

Jagadeesh Reddy fire on cm Revanth Reddy: తాను సీఎం అవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ను వాడుకున్నాడు

తాను సీఎం అవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ను వాడుకున్నాడని కాంగ్రెస్ మీద తనకు ఎలాంటి ఇష్టం లేదని కాంగ్రెస్ నీ ముంచడానికే వచ్చాడని అన్న జగదీశ్వర్ రెడ్డి

తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం కోసం కాంగ్రెస్ ని వాడుకున్నాడని కాంగ్రెస్పై తనకు ఎలాంటి అభిమానం లేదని కాంగ్రెస్ను ముంచడానికి అధికారంలోకి వచ్చాడని మాజీ కమిషన్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచిపోవడానికే వచ్చారని కార్యకర్తలే తనతో అంటున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పట్ల ఏమాత్రం ప్రేమ లేదని, పార్టీని కేవలం సీఎం కావడానికి మాత్రమే వాడుకున్నారని కార్యకర్తలు చెబుతున్నారన్నారు.

కాంగ్రెస్కు నిజమైన కార్యకర్తలు తమకు ఫోన్ చేసి చెబుతున్నారని కాంగ్రెస్ ను ముంచడానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని అన్నారని ఆ పార్టీ యొక్క కార్యకర్తలే చెప్తున్నారని అన్నారు. ఊర్లో మాత్రం కొన్ని బూతు మాటలు కూడా చెప్పుకుంటున్నారని అది కేవలం మీకు మీ మంత్రులకే మాట్లాడుస్తుందని మాకు సంస్కారం ఉందని మేము అలాంటి మాటలు మీడియా ముందు మాట్లాడబోమని ఆయన అన్నారు మాకు మా పార్టీ అధినేత కేసిఆర్ కొంత క్రమశిక్షణతో మనకు నేర్పారని మీకు మీ మంత్రులకు అది లేదని మీరు ఎక్కడపడితే అక్కడ బూతులే మాట్లాడతారని అన్నారు. మీకు మీ క్యాబినెట్ మంత్రులకు అదొక వ్యసనంలా మారిపోయిందని అన్నారు. గ్రామంలోని ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న విధానాన్ని వాళ్ళు వేరే విధంగా వారి భాషల్లో చెప్తున్నారని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా రాష్ట్ర మంత్రులు సీఎం కాలయాపన చేస్తున్నారని అన్నారు రాష్ట్ర పరిస్థితిలో రోజురోజుకు అద్వానంగా మారుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ముంచేసినంకే వెళ్తాడని అంతవరకు తాను కాంగ్రెస్ను వీడకూడని అన్నారు వికారాబాద్ రైతులను అరెస్టు చేసిన సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పస లేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో రైతన్నలు రోడ్డెక్కారు.

హైడ్రాపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల కోసం విద్యార్థిలోకం భగ్గుమంది. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర్రజేశారు. కులగణన ప్రశ్నలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రంపై ఒక విజన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన పాలన చేయడం లేదని అన్నారు హైడ్రా పేరుతో కట్టుకున్న గుడిసెలను ఇండ్లను కూలదోస్తూ ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటూ తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని ఢిల్లీకి వెళ్ళ్ల కుండా ఇక్కడ ఏ పని జరగదని ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు విద్యా వ్యవస్థకు మంత్రి లేకపోవడం ప్రభుత్వం యొక్క సిగ్గుచేటు చర్య అని అనడంలో ఎలాంటి అతిిిశక్తి అని అన్నారు.

Leave a Comment