Police arrested patnam Narender Reddy at house: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసి లాకెళ్లిన పోలీసులు
హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసే సమయంలో నరేందర్ను పోలీసులు లాక్కెళ్లారు. కారు వద్దకు తీసుకెళ్లి బలవంతంగా అందులోకి ఎక్కించారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. నిందితుడి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.ఘటనకు సంబంధించి పోలీస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
A-1గా భోగమోని సురేశ్ పేరు చేర్చారు. అధికారులపై హత్యాయత్నం జరిగిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్నారు. ముందుగానే కారం, రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు.కొడంగల్ BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న BRS నేత సురేశ్ ఆరోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసే సమయంలో నరేందర్ను పోలీసులు లాక్కెళ్లారు. కారు వద్దకు తీసుకెళ్లి బలవంతంగా అందులోకి ఎక్కించారు. ఆ క్రమంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులను ఆయన ప్రశ్నించడం వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా లగచర్ల ఘటనకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్లలో కలెక్టర్, కడా ప్రత్యేక అధికారిపై దాడిలో నరేందర్ పాత్ర ఉందా..? అనే కోణంలో వివరాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్ అక్కడికి చేరుకున్నారు. అప్రమత్తమైన బీఆర్ఎస్ నేతలను సైతం అరెస్టు చేశారు.పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు.
అక్రమ అరెస్ట్పె ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నరేందర్ భార్య శ్రుతితో కూడా ఆయన ఫోన్లో మాట్లాడారు. కాగా లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేశ్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూసేకరణ పేరిట పేదల భూములను లాక్కుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు.కలెక్టర్, అధికారులపై దాడులు చేయడం మంచిదేనా KTR అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని BRS నేతలు చెప్పడం దారుణమన్నారు.
లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్తో మాజీ MLA ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. దాడి వెనక ఎవరున్నా వదలబోమని హెచ్చరించారు. ఎఫ్-1 రేసులో RBI అనుమతి లేకుండా డబ్బులు చెల్లించారని, ఈ కేసులో KTR తప్పించుకోలేరని తెలిపారు.లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ‘కుట్ర కోణం ఉందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? కలెక్టర్ వెళ్లినప్పుడు ఎందుకు భద్రత కల్పించలేదు? ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై సీఎంకు ఎందుకంత ప్రేమ? శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది’ అని విమర్శించారు.