mp-chamala-kiran-kumar-reddy-allegations-on-ayodhya-ram-mandir-trust-corruption
అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో దాదాపు రూ.200 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అయోధ్య ట్రస్ట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆ సంస్థ కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో ప్రకటించినప్పటికీ.. ఉత్తరప్రదేశ్ సిట్ (SIT) పోలీసులు ఆయన అనుచరులనే అరెస్ట్ చేయడం ఇందుకు నిదర్శనమని ఎంపీ పేర్కొన్నారు.
దేవుడి పేరుతో వసూళ్లు.. దోపిడీ దేనికి?: మీడియాతో మాట్లాడిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువుల దైవ సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని ఈ విరాళాలు సేకరించారని మండిపడ్డారు.
-
“దేశంలో ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా, రాముడిపై భక్తితో అయోధ్య మందిర నిర్మాణం కోసం తమ వంతు విరాళాలు ఇచ్చారు. ప్రజలు ఆ డబ్బును దేవుడి కోసం ఇచ్చారే తప్ప, మీ దోపిడీ కోసం కాదు” అంటూ ఆయన ధ్వజమెత్తారు.
-
ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం యూపీకి మాత్రమే పరిమితమైన అంశం కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.
నిజాలు దాచడం సరికాదు: ట్రస్ట్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను కేవలం పదవుల నుంచి తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోదని ఎంపీ విమర్శించారు. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు వాస్తవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రాముడి పేరుతో వసూలు చేసిన కోట్లాది రూపాయల నిధులను దేనికి ఉపయోగిస్తున్నారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.
రాజకీయ కొనుగోళ్లు, ‘నీట్’ వ్యవహారంపై ఫైర్: ఇదే క్రమంలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన 20 మంది ఎంపీలను, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన 6 గురు ఎంపీలను.. ఒక్కొక్కరికి రూ.75 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇంత జరుగుతున్నా, ఇటు నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడటానికే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here
- Join Whats App: Join
Frequently Asked Questions (FAQs)
Q1: అయోధ్య రామాలయ ట్రస్ట్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?
-
A: అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో సేకరించిన విరాళాలలో దాదాపు రూ. 200 కోట్ల మేర అవినీతి జరిగిందని, దేవుడి పేరుతో వసూలు చేసిన డబ్బును దోచుకున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Q2: ఈ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఆయన ఎలాంటి డిమాండ్ చేశారు?
-
A: ఈ భారీ విరాళాల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.
Q3: ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ గురించి ఎంపీ ఏం చెప్పారు?
-
A: ట్రస్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని కార్యదర్శి చంపత్ రాయ్ బుకాయించినప్పటికీ, యూపీ సిట్ (SIT) పోలీసులు ఆయన మనుషులనే అరెస్ట్ చేశారని.. ఇప్పుడు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను పదవుల నుండి తప్పించి కేంద్రం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు.
Q4: బీజేపీపై ఎంపీ చామల చేసిన రాజకీయ కొనుగోళ్ల ఆరోపణలు ఏమిటి?
-
A: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన 20 మంది ఎంపీలను, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన 6 గురు ఎంపీలను.. ఒక్కొక్కరికి రూ. 75 కోట్లు ఇచ్చి బీజేపీ అక్రమంగా కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు.
Q5: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావన ఈ వ్యాఖ్యలలో ఎందుకు వచ్చింది?
-
A: దేశంలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడటానికే కేంద్రం ప్రయత్నించిందని మండిపడ్డారు.










