ప్రతి ఒక్క మహిళకి 3 లక్షల ఋణం కొత్త పథకం అందుబాటులోకి | Udyogini Scheme Eligibility In Telugu 2025

Udyogini Scheme Eligibility In Telugu 2025

కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఆర్ధిక భరోసా ఉన్నత స్తనాలవైపు వెళ్లడం కోసం మారియు చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పడం కోసం సాయం అందిస్తుంది అదేంటో ఒక సరి తెలుసుకుందాం..

దేశ ప్రధాని మోడీ ఇప్పుడు మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాడు. పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళా తానూ సొంతంగా చిన్న వ్యాపారాలను నిర్మించడం కోసమ్ ఆర్ధిక భరోసా కల్పిస్తోంది.దీని ద్వారా ప్రతి ఒక్క మహిళా తన కళను నెరవేర్చుకోవడంతో పాటు తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.కేంద్రం అందిస్తున్న ఉద్యోగిని పథకం ద్వారా ప్రతి మహిళా 3 లక్షల వరకు లోన్ సఉపాయం కల్పిస్తోంది.దీని ద్వారా మహిళా ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడం లేదా ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవడం లాంటివి చేసుకోవచ్చు.అంతే కాకుకుండా సబ్సిడీని కూడా అందిస్తుంది.

ఋణం ఎంత వరకు

  • కేంద్రం ఉద్యోగిని స్కీం ద్వారా లక్ష నుండి 3 లక్షల వరకు రుణాన్నీ అందిస్తుంది.
  • వైక‌ల్య‌మున్న మ‌హిళ‌లు, వితంతువులకు రుణ ప‌రిమితి లేదు. వారు నెల‌కొల్పే వ్యాపారం, వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు.
  • ఈ ఉద్యోగిని పథకం (Udyogini Scheme). అవసరమైన అర్హతా ప్రమాణాలున్న దరఖాస్తుదారులు ఈ పథకం కింద రూ. 3 లక్షల వరకు రుణం పొందవచ్చు.
సబ్సిడీ ఎంత
  • SC/ST/విడోస్/PH కి 50% వరకు సబ్సిడీ ఇస్తుంది కేంద్రం .
  • జనరల్ వారికి 30 % వరకు సబ్సిడీ ఉంటుంది.
వడ్డీ ఎంత

ఉద్యోగిని పథకం ద్వారా ఋణం పొందే SC/ST/PHC మహిళలకు 0% వడ్డీ ఉంటుంది.మిగిలిన వారికి 10 నుండి 15% వరకు వడ్డీ ఉంటుంది.

కావలసిన పత్రాలు

  1. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జ‌త చేయాలి
  2. ద‌ర‌ఖాస్తు చేస్తున్న మ‌హిళ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం
  3. దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారు రేష‌న్ కార్డు కాపీని జ‌త‌ప‌ర‌చాలి.
  4. ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  5. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  6. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  7. బ్యాంకు ఖాతా పాసు పుస్త‌కం తదితర డాక్యుమెంట్లు సమర్పించాలి.
Udyogini Scheme – ఎవరు అర్హులంటే..?
  • 18 సంవ‌త్స‌రాలు నిండిన 55 సంవ‌త్స‌రాల వ‌య‌సులోపు మ‌హిళ‌లంద‌రూ అర్హులే.
  • ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే మ‌హిళలు త‌మ క్రెడిట్ స్కోర్‌, సిబిల్‌ స్కోర్‌ బాగా ఉండేలా చూసుకోవాలి.
  • గ‌తంలో ఏదైనా రుణాలు తీసుకుని స‌రిగ్గా తిరిగి చెల్లించ‌కుండా ఉన్న‌ట్ల‌యితే రుణం ఇవ్వ‌రు.

FAQ

Leave a Comment