Telangana TGPSC Group 2 Key Released: విడుదలైన గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ

Telangana TGPSC Group 2 Key Released: విడుదలైన గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రూప్ ఖైలను భర్తీ చేయడం కోసం పరీక్ష నిర్వహించిన విషయం తెలిసేందే ఐతే ఇప్పు ఆ పరీక్షలకు సంబంధి ప్రిలిమినరీ కీ ని అధికారిక వెబ్సైటులో జనవరి 17న అధికారిక వెబ్సైట్లో పొందు పర్చడం జరిగింది.

డిసెంబరు 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. కీ లో ఏమైనా అభ్హ్యాంతరాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై సరైన అధారాలతో జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే నమోదు చేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు.  కీ జనవరి 22వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రెటురీ డాక్టర్‌ ఇ నవీన్‌ నికోలస్‌ ఓ ప్రటనలో తెలిపారు. గ్రూప్‌ 2 అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆన్సర్‌లను సరిచూసుకోవాలని సూచించారు.

అభ్యర్థులు తమ యొక్క అభ్యంతరాలను కేవలం ఇంగ్లీష్ మాధ్యమంలో ఇచ్చిన https://www.tspsc.gov.in/ లింక్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయాలనీ తెలిపారు.ఆన్‌లైన్‌ కాకుండా ఇతర పద్ధతుల్లో ఇచ్చిన అభ్యంతరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరింబోమని స్పష్టం చేశారు. అలాగే గడువు తేదీ ముగిసిన తరువాత వచ్చిన విజ్ఞప్తులను సైతం పరిగణించబోమని కమిషన్‌ సెక్రటరీ తన ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నిపుణుల కమిటీ వచ్చిన విజ్ఞప్తులను సరిచూసి తుది ఆన్సర్‌ కీ తయారు చేస్తారు. అనంతరం రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 2 ఫలితాలు కూడా వెల్లడిస్తారు.

Leave a Comment