Telangana Indiramma Indlu scheme started now: ఇంద్రమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికను వేగవంతం 2024
ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికను ఈనెల చివరివారం నుంచి ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం..
Telangana Indiramma Indlu scheme started now తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలైన ఇంద్రమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికను వేగవంతం చేయాలని ఆలోచిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే నవంబర్ నెల చివరి వారం నుంచి అర్హుల ఎంపిక జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఒకవేళ నవంబర్ చివరివారంలో ఎంపిక ప్రక్రియ కొనసాగకపోతే డిసెంబర్ మొదటి వారం నుంచి ఎంపిక చేయాలని భావిస్తూ ఉంది. నిజానికి ఈనెల 15 నుంచి 20 వరకు గ్రామ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను ఎంపిక చేయవలసి ఉంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిబంధనల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది ఈ ప్రక్రియను ప్రారంభించడానికి నిబంధనలు కంపల్సరీ కాబట్టి ఇద్దరి మధ్య నిబంధనలకు లోటు రావడంతో ఈ ప్రక్రియను ఆపివేశారు కేంద్ర ప్రభుత్వం యాప్ లో ఉన్న సమాచారానికి రాష్ట్ర ప్రభుత్వ యాప్ లో ఉన్న సమాచారానికి సరితూ ఒక పోవడంతో నిబంధనలో మధ్య విభేదాలు రావడంతో గ్రామసభలు నిర్వహించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండ్ల నిర్మాణానికి ఫండ్ కావాలి అంటే కచ్చితంగా నిబంధనలను పాటించవలసి ఉంది కానీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఉండడం ద్వారా ఈ ప్రక్రియను ఆపివేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ వారంలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతం ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనంతరం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గతంలో గృహ లబ్ధిపొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని గుర్తించారు. లబ్ధిదారుల ఎంపికకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని, గ్రామసభల ద్వారానే ఎంపిక ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్లో గ్రామపంచాయతీ కార్యదర్శుల వివరాలనూ నమోదు చేశారు. వీడు ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.
ఇంటి నిర్మాణం కోసం స్థలం లేని వారికి 400 చరపుమీటర్ల స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో అయితే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది.
రాష్ట్రంలో ఐదేళ్లలో రూ.28 వేల కోట్లతో 20 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో రూ.7,740 కోట్లు ఖర్చు చేయనుంది. గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో స్థలం లేనివారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే అవకాశాలు ఉన్నాయి.