PMEGP Dairy Farm Subsidy Details: PMEGP ద్వారా ఎంత మొత్తంలో సబ్సిడీ వస్తుంది 2024

Photo of author

By Admin

PMEGP Dairy Farm Subsidy Details: PMEGP ద్వారా ఎంత మొత్తంలో సబ్సిడీ వస్తుంది

డైరీ ఫామ్ కోసం చాలామంది ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది కదా దాంట్లో పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు .కానీ మొత్తానికి మొత్తం లోన్ గా ఏ బ్యాంకు ఇవ్వదు. మీరు కొంత మొత్తంలో నగదు పెట్టుకుంటే మరికొంత మొత్తంలో అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీ ఇస్తూ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సదుపాయాలను కల్పిస్తుంది.

PMEGP Dairy Farm Subsidy Details డైరీ ఫామ్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డైరీ ఫామ్ పెట్టీ ఎక్కువ మొత్తంలో లాభాలను పొందడమే దీనికి ముఖ్యమైన రీజన్.ఈ డైరీ ఫామ్ పెట్టడం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డైరీ ఫామ్ కోసం చాలామంది ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది కదా దాంట్లో పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు .కానీ మొత్తానికి మొత్తం లోన్ గా ఏ బ్యాంకు ఇవ్వదు. మీరు కొంత మొత్తంలో నగదు పెట్టుకుంటే మరికొంత మొత్తంలో అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీ ఇస్తూ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సదుపాయాలను కల్పిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరుని వ్యవసాయం వైపు మళ్లించేందుకు మరియు సొంత వ్యాపారం వైపు మళ్లించేందుకు కొత్త పథకాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే ఇంతకుముందు డైరీ ఫాం పెట్టుకోవాలి అంటే కార్పొరేషన్ లోన్స్ నాబార్డ్ ద్వారా రుణాన్ని తీసుకొని దాని ద్వారా సబ్సిడీ పొందడమే కాకుండా కొంత మొత్తంలో కడుతూ వచ్చేవారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పీఎం PMEGP ద్వారా డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకునే వారికి సబ్సిడీ రూపంలో కొంత రాయితీ కల్పిస్తూ వస్తోంది.ఆ లోన్స్ ఎలా పొందాలి రైతు ఏలా అప్లై చేసుకోవాలి. మొత్తం డైరీ ఫామ్ పెట్టడానికి ఎంత ఖర్చవుతుంది అనేదాని గురించి తెలుసుకుందాం…

డైరీ ఫార్మ్ ఎలా పెట్టాలి

దాదాపు డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకునే వారు ఎవరో చెబితేనో లేదా యూట్యూబ్లో చూసి పెడుతూ ఉంటారు లక్షల్లో ఆదాయం వస్తుందని యూట్యూబ్లో చెప్తూ ఉంటారు కాబట్టి అది నమ్మి ఎలాంటి అనుభవం లేకుండా ఎవరిని సంప్రదించకుండా వారికి వారే డబ్బులు పెట్టి నష్టాలు ఒకే వెళ్తూ ఉంటారు అలా కాకుండా మీరు డైరీ ఫార్మ్ పెట్టాలి అని అనుకున్నా వెంటనే మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక డైరీ ఫార్మ్ కి వెళ్లి ఒక నెల వరకు అందులో ఉండి ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకున్న తరువాత మీరు డైరీ పెట్టుకుంటే బాగుంటుంది.

అలా మీరు చూసిన తర్వాత మాత్రమే మీకు డైరీ ఫామ్ లో ఆదాయం ఎలా ఉంటుంది ఎలా కష్టపడాలి అనే దాని గురించి తెలిసి వస్తుంది. మీరు నెల కష్టపడిన తర్వాత ఆ పని మీకు వచ్చి ఉంటే మీకు పెట్టుకోవాలి అని నమ్మకముంటే మీరు డైరీ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు మళ్లీ చెప్తున్నాను మీరు దగ్గర్లో ఉన్న డైరీ ఫార్మ్ కు వెళ్లి ఒక నెల వరకు అందులో పని చేయండి అప్పుడే మీకు డైరీ ఫార్మ్ లో ఉన్న ఆదాయం నష్టాలు తెలిసి వస్తుంది.

డైరీ ఫార్మ్ పెట్టేముందు ఎలాంటి సూచనలు పాటించాలి

డైరీ ఫార్మ్ పెట్టేముందు ఫస్ట్ మనం పాటించాల్సిన సూచనలు ఏమిటంటే

  • గేదెలకు కానీ ఆవులకు కానీ వెలుతురు వచ్చేటట్టుగా షెడ్డును నిర్మించుకోవాలి.
  • షెడ్డు పైన తక్కువ ఇన్వెస్ట్ అనేది పెట్టాలి.
  • మనం గేదెలతో డైరీ ఫార్మ్ రన్ చేయాలి అనుకుంటున్నారా లేదా ఆవులతో డైరీ ఫార్మ్ పని చేయాలి అనుకుంటున్నారా వాటికి తగ్గట్టుగా మీరు ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
  • వెటర్న్ యు డాక్టర్ తో కన్సల్ట్ ఉండాలి.

డైరీ ఫార్మ్ పెట్టడానికి కావలసిన పరికరాలు ఏంటి

  • డైరీ ఫార్మ్ పెట్టుకోవాలి అనుకునేవారు కచ్చితంగా ఒక 5 ఎకరాల్లోపు ల్యాండ్ ఎంచుకోవాలి వాటికి బండ్లు వచ్చి వెళ్లే విధంగా దారి ఉండాలి.
  • ఆవులకు గేదెలకు నీరు అందించే విధంగా నీరు సరఫరా ఎక్కువగా ఉండాలి దాని కోసం బోరు వేసుకోవాల్సి ఉంటుంది.
  • గేదెలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.
  • వెలుతురు వచ్చే విధంగా అంటే వాటికి ఎండ తాకే విధంగా షెడ్డును నిర్మించుకోవాలి.
  • గేదెలకు ఆవులకు గడ్డి బలం కాబట్టి గడ్డిని ఎక్కువగా షాప్ కట్టర్ ద్వారా కట్ చేసి ఇస్తే వాటికి ఫీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది.
  • గేదెలకు గాని ఆవులకు గాని మొదటగా గడ్డి కావాలి కాబట్టి మనం డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకునే మూడు నెలల ముందే నాలుగు ఎకరాల్లో గడ్డి అయితే పెంచుకోవాలి.
యూనిట్ కాస్ట్ ఎంతవరకు ఉంటుంది

మామూలుగా డైరీ ఫార్మ్ రన్ చేయాలి అనుకుంటే ఒక్కొక్క గేదెకు ఆవుకో 1,50,000 చొప్పున అయితే ఖర్చవడం జరుగుతుంది షెడ్డు ఏర్పరచుకోవడానికి ఒక రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ మీరు షెడ్ కి తక్కువ ఖర్చు పెట్టి గేదెలు ఆవుల పైన ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా మీకు ఆదాయం అనేది ఎక్కువగా రావడానికి వీలు ఉంటుంది మీరు షర్టు పైన ఎక్కువ ఖర్చు పెట్టి గేదెలకు ఆవుల పైన తక్కువ ఖర్చు పెడితే మీకు నష్టాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు షెడ్డును ఏర్పరుచుకునే తక్కువగా ఉండేటట్టు చూసుకొని గేదెల పైన ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా అయితే మీరు ప్లాన్ అనేది రెడీ చేసుకోవచ్చు. దాదాపు యూనిట్ కాస్ట్ వచ్చేసరికి 10 లక్షల వరకు ఉంటుంది.

లోన్ ఎలా తీసుకోవాలి

ఇక లోన్ లోన్ విషయానికి వస్తే డైరీ ఫార్మ్ పెట్టుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలోని ఇస్తుంది కదా దానుంచే తీసుకుంటాం అక్కడి నుంచి మనకు సబ్సిడీ కూడా వస్తుంది కదా ఇంకేంటి అని అనుకుంటారు కానీ ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా మీకు లోనైతే ఇవ్వదు కేవలం దాంట్లో 50% లేదా 70% వరకు లోన్ అయితే ప్రభుత్వం మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 30% వరకు మీరు సొంతంగా పెట్టుకోవలసి ఉంటుంది. బ్యాంకు నుండి మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటే మీ యొక్క సొంత ప్రాపర్టీతో తీసుకోవడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. మీరు లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకు సబ్సిడీ గురించి ఆలోచిస్తుంది. మీకు ఎంత లోన్ ఇవ్వాలి.

అనే దాన్ని పైన బ్యాంకు ది ఫైనల్ కాబట్టి బ్యాంకుకు మీరు లోన్ అప్లై చేసుకునే ముందు మీ యొక్క యూనిట్ కాస్ట్ కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ వారికి సబ్మిట్ చేస్తే మీ యొక్క ప్రాజెక్టు వారికి నచ్చితే మీకు లోన్ అనేది ఇస్తారు బ్యాంకు లోన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్

  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ పాస్ బుక్
  • పాస్ ఫొటోస్
  • ప్రాజెక్టు రిపోర్ట్
  • మీరు ఏమైనా చదువు ఉంటే స్టడీ సర్టిఫికెట్స్ కూడా పెట్టవలసి ఉంటుంది.
  • పాన్ కార్డు
  • కుల ధ్రువకరణ పత్రం
  • ఆదాయ ధ్రువకరణ పత్రం
  • ఒక వేల మీరు డైరీ ఫామ్ కోసం స్థలం లీజు కు తీసుకున్నట్లయితే లీజు పత్రం/ సొంతంగా ల్యాండ్ ఉన్నట్లయితే పట్ట బుక్

సబ్సిడీ మనకు ఎలా అందుతుంది

బ్యాంకు నుంచి మీరు లోన్ తీసుకున్న తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఏ పథకానికైనా అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కువ లోన్ కావాలి అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డ్ ద్వారా సబ్సిడీ అనేది ఇస్తుంది మరియు పిఎం ఈజీపి ద్వారా కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

కాబట్టి బ్యాంకుకు వెళ్లి మీరు లోన్ తీసుకునే టైం లో దీన్ని సబ్సిడీకి మార్చండి అంటే వారు నాబార్డుకు పంపించడం జరుగుతుంది. లేదా మీరు లోన్ తీసుకున్న తర్వాత పీఎం ఈజిపి వెబ్సైట్లోకి వెళ్లి మీ యొక్క డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ అయితే కేంద్రం మీ యొక్క ప్రాజెక్టు రిపోర్ట్ ని మీరు లోన్ వివరాలు స్టడీ చేసి మీకు సబ్సిడీ జనరల్ కేటగిరీ అయితే 25% ఎస్సీ ఎస్టీ బీసీ ewc వారు ఇతే 30 నుంచి 35 శాతం వరకు అందించడం జరుగుతుంది. పీఎం ఎజేపి నుంచి లోన్ కావాలి అంటే కచ్చితంగా ఒక నెల అయినా మీరు డైలీ ఫామిలీ నడపవలసి ఉంటుంది.

మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి

మీరు పెట్టుకునే యూనియన్ కోసం మీకు లాభాలు రావాలి అంటే కచ్చితంగా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఉంటుంది మార్కెటింగ్ చేసుకోకపోతే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మార్కెటింగ్ అనేది ప్రాపర్ గా చేసుకుంటేనే మీకు నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్లడం జరుగుతుంది మీరు మార్కెటింగ్ చేసుకోకుండా పెట్టమంటే పెట్టమని అనుకుంటే మీకు నష్టాలు చూస్తారు కాబట్టి ఏ బిజినెస్ కైనా మనకు మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్.

Leave a Comment