SRH Team Owner Sensational Comments on HCA
తెలంగాణలో జరుగుతున్న ఐపీల్ పై srh ఓనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వానికి ఇష్టంలేకపోతే చెప్పండి వేదిక మార్చుకుంటాం అని అన్నారు
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రెండు మ్యాచ్స్ ను హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ముగించిన సంగతి తెలిసిందే ఐతే ఇప్పుడు ఫ్రాంచైజ్ ఓనర్ ఐన కావ్య మారన్ టీం సంచలన వ్యాఖ్యలు చేశారు.మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఉచిత పాసుల గురించి జారిగే గొడవ ఇప్పుడు చాల పెద్దదవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.పాసుల కోసం SRH యాజమాన్యాన్ని HCA వేధింపులకు గురిచేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివరాలను సేకరించిన ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.అయితే ఉచిత పాస్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ప్రతినిధి HCA కోశాధికారికి లేఖ రాశారు. కోరినన్ని పాస్లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్కు తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో HCA అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని, ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.హైద్రాబాద్ను హోమ్ గ్రౌండ్ గా చేసుకుని మ్యాచ్ ఆడడం తమకు ఇష్టంలేదేమొ అని లేఖ్హాలో పేర్కొన్నారు.