September 1 New Rules : ఆమ్మో 1 తారీఖు… అమలవుతున్న కొత్త రూల్స్ ఇవే
ప్రభుత్వం ఈ సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి కొత్త రూల్స్ ను ఐతే అమలులోకి తేనుంది. ఈ కొత్త రూల్స్ అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు పాటించాలసిందే. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు తీసుకొనే నిర్ణయాలు ఆయా పాలసీల్లో మార్పులు ప్రజల జీవిత ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అనేది తేలుకుందాం. ప్రభుత్వం మార్చబోయే రూల్స్ ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవచ్చు. మరి నాలుగు రోజుల్లో కొత్త ఆంగ్ల మాసం రాబోతుంది కాబట్టి అమలయ్యే రూల్స్ ఒకసారి చూద్దాం .
కొత్త మార్పులు వీటిలో జరగనున్నాయి.
LPG గ్యాస్ సిలిండర్ ధరల నుండి క్రెడిట్ కార్డు నిబంధనల వరకు అన్నింటిలో మార్పులు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. కాబట్టి ఈ మార్పులు మన జేబుపై ఎలాంటి శ్రద్ధ చూపుతాయి చూద్దాం.
1) LPG గ్యాస్ సిలిండర్ 2) ఆధార్ కార్డు 3)క్రెడిట్ కార్డు 4) డియర్ నెస్ అలవెన్స్ 5)ATF,CNG-PNG రేట్స్ 6) ఫేక్ కాల్స్
LPG గ్యాస్ సిలిండర్ ధరలు
ప్ప్రతి నెల ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం LPG ధరను సవరిస్తుంది. కమర్షియల్ గ్యాస్ సీలిండెర్స్,వంటగ్యాస్ ధరల్లో మార్పులు అయితే వస్తాయి. ఈసారి కూడా LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు అయితే ఉండనుంది. గత నెలలో కమర్షిల్ గ్యాస్ సిలిండర్ ధరRs 8.50 పెరగగా ,జులై నెలలో రూ.30% తగ్గింది.
2) ఆధార్ కార్డు
ఇప్పటి వరకు ఫ్రీగా ఉన్న ఆధార్ అప్డేట్ కు సెప్టెంబర్ 14 న చివరి తేదీ నిర్ణయించారు.మల్లి పొడిగాస్తారా లేదా అనేది తెలియదు కాబట్టి ఇప్పటి వరకు మీరు మీ ఆధార్ ను అప్డేట్ చేసుకోకుంటేయ్ ఇప్పుడే వెళ్లి అప్డేట్ చేసుకొంది. సెప్టెంబర్ 14 తరువాత మీరు ఫీజు చెల్లించి మరి అప్డేట్ చేసుకోవలసి వస్తుంది.
3)క్రెడిట్ కార్డు
సెప్టెంబర్ 1 నుండి HDFC బ్యాంకు యుటిలిటీ ట్రాన్సక్షన్స్ పై పొందే రివార్డ్ పాయింట్లపై పరిమితి విధించనుంది. కస్టమర్స్ ఈ ట్రాన్సక్షన్ల పై నెలకు 2,000 పాయింట్ల వరకు మాత్రమే పొందగలరు.థర్డ్ పార్టీ అలా ద్వారా చేసే ఎడ్యుకేషన్ ప్రెమెంట్స్కి HDFC ఎలాంటి రివార్డ్స్ ఇవ్వదు .
అలానే IDFC ఫస్ట్ బ్యాంకు తమ కార్డు లపై చెల్లించాల్సిన మినిమం డ్యూ డేట్ ను తగ్గించనుంది.బిల్ గెనెరతె అయినా తేదీ నుండి 15 రోజుల్లోపు పేమెంట్ చేయాలి .ఇది కాకుండా సెప్టెంబర్ 1 నుంచి UPI మరియు ఇతర ఫ్లాట్ ఫామ్ లతో ప్రెమెంట్స్ కి రూపే క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించే కస్టమర్స్ కి కూడా ఇతర రివార్డ్ పాయింట్ లను పొందుతారు.
4) డియర్ నెస్ అలవెన్స్
సెప్టెంబర్ లో కేంద్ర పరభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ 3% పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు 50% డియర్ నెస్ అలవెన్స్ ఇస్తుండంగా,3% పెంచితే అది 53% చేరనుంది.
5)ATF,CNG-PNG రేట్స్
LPG గ్యాస్ సీలిండెర్స్తో పాటు,ఆయిల్ మార్కెట్ కంపెనీలు,ఎయిర్ టర్భైన్ ఫుయల్ (ATF),CNG -PNG సవరిస్తాయి.నెల ప్రారంభంలోనే ఈ ధరల ప్రకటన రావచ్చు .
6) ఫేక్ కాల్స్
ఫేక్ కాల్స్,మెస్సేజ్ లపై JIO ,ఎయిర్టెల్,వోడాఫోన్,BSNL లాంటి టెలికాం కంపెనీలకు ట్రై కొత్త ఆదేశాలను జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కాల్స్ మెసేజెస్ తగ్గనున్నాయి. 140 సిరీస్ ద్వారా టెలి మార్కెటింగ్ ,కమర్షిల్ మెస్సేజెస్ బ్లాక్ చైన్ ఆధారంగా DLT అనే కొత్త సిస్టెంకి తరలించాలి అని ఈ విధానాన్ని సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలి అని ట్రై ఆదేశాలు జారీ చేసింది.