Rythu Runamafi:రుణమాఫీ కానీ రైతులకు కీలక అప్డేట్ : మంత్రి
రుణమాఫీ కానీ చాలామంది రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం ఆని తెలియజేశారు.
రుణమాఫి దశలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ వచ్చింది ఇప్పుడు 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15వ తేదీన అయితే మాఫీ చేయడానికి రెడీ అయింది దేనికోసం 12వేల కోట్లను అయితే ఇప్పటికే సర్దుబాటు చేసుకుంది ఖమ్మంలోని వైరా వేదికగా ఈ రెండు లక్షల రుణమాఫీని అయితే సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మొదటి దశలో లక్షలు ఉన్న రుణాల కోసం 6098 కోట్లను 11.50 లక్షల మంది రైతు కుటుంబాలకు విడుదల చేయడం జరిగింది. అదే విధంగా రెండవ దశలో లక్ష నుంచి లక్షన్నరలోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రుణమాఫీ చేయడం కోసం 7,000 కోట్లతో ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
రుణామాఫీ ఎందుకు కాలేదు
రాష్ట్రంలో చాలామంది రైతులకు ఇంకా రుణమాఫీ అయితే కాలేదు దీని వల్ల చాలామంది రైతులు రోడ్డు దాల్చిన పరిస్థితి వచ్చింది. మొదటి దశ విడుదలైనప్పుడు అర్హత ఉన్నా కూడా చాలామంది రైతులకు రుణమాఫీ అనేది అందలేదు దీంతో చాలామంది రైతులు చుట్టూ మరియు తాసిల్దారుల చుట్టూ తమ పనులు వదిలేసుకొని మరి చెప్పులు అరిగేలా తిరిగారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎందుకు రుణమాఫీ కాలేదు అన్నదాని గురించి వివరాలు అంతా ఏఈఓ దగ్గర ఉంటాయని కావాల్సి వస్తే ఏఈఓ దగ్గరకు వచ్చి మీ ఆధార్ కార్డు మరియు మీ పట్టా పాస్బుక్ ఇచ్చి వివరాలు తెలుసుకోవాలని అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ తెలపడం జరిగింది అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలిపారు. చాలాచోట్ల ఈ విషయమై రాస్తారోకోలు కూడా రైతులు నిర్వహించారు. కొన్ని టెక్నికల్ ఇష్యుల వల్ల రైతులకు రుణమాఫీ కాలేదు అని మంత్రి పొన్నం తెలిపారు అవి చూసుకున్నట్లయితే.
1. బ్యాంకు పాస్ బుక్ల్లో పేరు తప్పుగా నమోదవడం
2. రైతు యొక్క సంబంధిత ఆధార్ కార్డు మరియు బ్యాంకు పాస్ బుక్ లో ఉన్న పేరు సరికాకుండా ఉండడం.
3. రైతు తీసుకున్న అసలు కన్నా మిత్తి ఎక్కువగా ఉండడం వల్ల బ్యాంకర్లు వారి పేరు నమోదు చేయకపోవడం
ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మంది రైతులకు ఈ రైతు రుణమాఫీ అనేది అందలేదు.
రైతులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్
రుణమాఫీ కానీ రైతులు అధైర్య పడవద్దు అని ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని మా ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలాగా చూస్తామని అయితే మంత్రి పొన్నం చెప్పారు ఎవరికైతే రుణమాఫీ అనేది అందలేదు వారి కోసం ఒక నెలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఈ స్పెషల్ డ్రైవ్ లో తమకు ఎందుకు రుణమాఫీ కాలేదు అనే దాని గురించి చర్చిస్తామని అంతేకాకుండా ప్రతి ఒక్క దగ్గర నుంచి వివరాలు సేకరించి వాటిని నమోదు చేసి తమకు రైతు రుణమాఫీ జమ అయ్యేంతవరకు చూస్తామని తెలపడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మళ్లీ మేము చేయమని రైతులకు మంత్రి పూర్ణం తెలపడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు వివిధ టెక్నికల్ కారణాల వల్ల మూడు లక్షల మందికి ఇంకా రుణమాఫీ జరపలేదని తెలపడం జరిగింది .
గమనిక: మరిన్ని వివరాల కోసం మరియు పథకాల కోసం ఉద్యోగాల వివరాల కోసం మన వెబ్సైట్ని ఫాలో అవ్వగలరు.
5 thoughts on “Rythu Runamafi:రుణమాఫీ కానీ రైతులకు కీలక అప్డేట్ : మంత్రి”