Rythu Bharosa 2024: భరోసాను మర్చిపోయిన రైతులు మాఫీ అయ్యేనా ఇకనైనా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరి రైతులకు రైతు రుణమాఫీ చేయకుండా కొందరికే రుణమాఫీ చేయడం రైతులు ఆగ్రహానికి గురయ్యి రోడ్ల మీదకు రావడం జరిగింది.
రాష్ట్ర రాజకీయం
తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఇప్పుడు రైతు రుణమాఫీ చుట్టూ తిరుగుతుంది.ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ హామీలైన 2లక్షల రుణమాఫీ 3 దశల్లో కొనసాగింది.అయిన కూడా కొంతమంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు దీనితో ఆగ్రహించిన రైతులు వెళదిగా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు రాస్తరోకోలు చేయడం ప్రారంభించారు.ఇదే అదునుగా తీసుకున్న ప్రతిపక్ష పార్టీలు అందరి రైతులకు మాఫీ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం అని అన్నారు. దీంతో రాజకీయ నాయకులతో పాటు రైతులు కలిసి రోడ్లమీద ధర్నాలు చేయడం ప్రారంభించారు.
రుణమాఫి కానీ వారికి కొత్త ఆప్
రుణమాఫీ కానీ రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అయితే తయారు చేయించింది. ఈ యాప్ సంబంధించి లింకులను ఇప్పటికే మండల జిల్లా విస్తరణ అధికారులకు అయితే పంపించడం జరిగింది ఈ యాప్ ను సోమవారం రోజు ట్రైలర్ అనేది చేసిన తర్వాత మాత్రమే రైతు వివరాలు ఎంట్రీ చేయాలనీ తెలిపారు. ఏ రైతులకు అయితే రుణమాఫీ కాలేదో ఆ రైతుల యొక్క వివరాలను ఈ యాప్ ద్వారా అయితే తెలుసుకోనంది. రుణమాఫీ కానీ రైతులకు రేషన్ కార్డు లేకపోతే కుటుంబ వివరాలను తీసుకొని ఆప్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. రైతుల ఇష్టపూర్వకంగా కుటుంబ వివరాలు ఇచ్చినట్టు ఇంటి యాజమనీ దగ్గర నుండి సంతకము తీసుకుంటున్నారు.ఇలా చేయడం ద్వారా ఎవరికాగి అందలేదో తెలుస్తుందని అందకపోవడానికి గల కారణాలు కూడా తెలిసి వస్తాయి అని పేర్కొన్నారు.ఇప్పటికే గ్రామాల్లో సర్వే ప్రారంభం ఇందని సీఎం తెలిపారు.
మంత్రుల స్పందన
రైతులు రొడ్లెక్కి తమ నిరసన తెలుపుతున్న వేల కాంగ్రెస్ మంత్రులు ఆందోళనకు గురవుతున్నారు అని న్యూస్ చానల్స్ చెపుతున్నాయి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతూ నిరసనలకు స్పందిస్తూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్క రైతుకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి తీరుతాం అని అన్నారు.ఇప్పటి వరకు రుణమాఫీ కోసం 30 కోట్లు ఖర్చు చేశాం అని తెలిపారు.గ్రామాల్లో సర్వేలు జరుగుతున్నాయి అని అవి పూర్తైన వెంటనే నిధులు విడుదల చేస్తాం అని అన్నారు.అప్పటి వరకు రైతులు కొంచెం శాంతం గా ఉండాలని రైతులను విజ్ఞప్తి చేశారు.
రైతూ భరోసా ఎక్కడ ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఇస్తున్న 10000 వేల రూపాయల రైతూ బంధును 15000 వేలు చేసి ఇస్తాం అని తెలిపింది కాని అధికారంలోకి ఏడాది కావొస్తున్న కూడా ఇంతవరకు రైతు భరోసాకి సంబంధించి మార్గదర్శకాలు కానీ కనీసం దాని ఊసే లేకుండా పోయింది.రైతులు ఎంత సేపటికీ రైతు రుణమాఫీ మాకు అవ్వలేదు అని రొడ్లెక్కరే కానీ దానితో పాటు భరోసా ఎక్కడ అని ప్రశ్నించే వారే లేకుండా పోయింది. రైతు రుణమాఫీనీ అండగా చేసుకొని తమ రాజకీయ లాభాల కోసం ప్రతిపక్షాలు రైతులను ఉసాగోలుపుతున్నారు అని కొంతమంది అంటున్నారు.
2 thoughts on “Rythu Bharosa 2024: భరోసాను మర్చిపోయిన రైతులు మాఫీ అయ్యేనా ఇకనైనా”