నా పై దుష్ప్రచారం మనుకోక పోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం | RS Praveen Kumar Fire on Congress Social Media 2025

RS Praveen Kumar Fire on Congress Social Media

నేను పార్టి మారుతున్నాను అని మీకు చెప్పనా నాపై ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు.ఇకనైనా ఇవి మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం…

రైతు ప్రస్థానం డెస్క్: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS నేత RS. ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘నా రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్పచారం చేస్తోంది. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా. అణచివేతకు గురైన వర్గాల విముక్తికి BRS సరైన వేదిక అని నమ్మి ముందుకు వెళ్తున్నా. BRS మళ్లీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ 2.0ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నా’ అని స్పష్టం చేశారు..కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై గత 2 రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిల్లర వేషాలను కాంగ్రెస్ నేతలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అలాగే తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో.. ఏ వర్గాల భవిష్యత్తు కోసం పని చేయాలో క్లారిటీ ఉందన్నారు..

demo

Leave a Comment