Revanth reddy New Scheme for Unemployed youth
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కు గుడ్ న్యూస్ చెప్పింది.నిరుద్యోగ యువతను ఆర్ధికంగా వృద్ధి చేయడం కోసం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ పథకం ద్వారా ప్రతి నిరుద్యోగ యువత 2 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు అలాగే బ్యాంకులు వీరికి 2 లక్షల వరకు రుణాన్ని ఇవ్వనున్నాయి.ఈ పథకాన్ని సంభందించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం ….
పథకం ముఖ్య ఉద్దేశం
ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగికి సొంతంగా స్వయం ఉపాధిని కలిపించాలనేది (తన కాళ్ళ మీద తానె నిలబడాలి)ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం..
పథకం వ్యయం
ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 6000 కోట్లను విడుదల చేసింది.
- 3000 కోట్లను కార్పొరేషన్స్ ద్వారా నిరుద్యోగులకు అందిస్తుంది.దీనికి మార్జిన్ సౌకర్యం ఉంది.
- మరో 3000 కోట్లను బ్యాంకుల దగ్గర నుండి నిరుద్యోగులకు రుణంగా అందిస్తుంది.
రుణ సహాయం ఎంత
ఈ పథకం కింద లబ్ది పొందే వారికి బ్యాంకులు మరియు కార్పొరేషన్స్ 50,000 ,లక్ష,2 లక్షల చొప్పున ప్రాజెక్ట్ ని బట్టి ఇవ్వనున్నాయి.
పథకం యొక్క కాల పరిమితి
ఈ పథకాన్ని అంబేదఖర్ జయంతికి ఆరంభించబోతున్న కారణంగా మార్చి 2 నుండి పథకానికి దరఖాస్తులు తీసుకుంటుంది.మర్చి 2 నుండి ఏప్రిల్ 14 వరకు లబ్దిదారులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
అర్హతలు
అభ్యర్థి ఈ క్యాటగిరిలకు చెందినా వాడై ఉండాలి.
- SC ,ST ,బీసీ మరియు మైనారిటీ యూవత.
- తెలంగాణ నివాసితులై ఉండాలి.
- స్వయం ఉపాధి ప్రారంభించేందుకు ఆసక్తి ఉన్న వారై ఉండాలి
దరఖాస్తు ప్రక్రియ
ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు సంబంధిత కార్పొరేషన్ లేదా బ్యాంకులకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈ పథకానికి అప్లై చేసుకునే వారు తమ ప్రాజెక్ట్ /యూనిట్ కి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి
ఎంపిక
కార్పొరేషన్ మరియు బ్యాంకులు మీ అప్లికేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించి మీ యొక్క సర్టిఫికెట్స్ ఒకే అనుకున్న తరువాత మిమ్మల్ని ఎంపిక చేస్తారు.ఎంపికైన వారికి రుణాలు మంజూరు చేయబడతాయి..
రాయితీ ఎలా
ఈ పథకాన్ని అప్లై చేసుకునే వారికి పథకం ద్వారా రాయితీ మరియు కొంత మేర మార్జిన్ ఉండే అవకాశం ఉంది దాదాపుగా 30 శాతం వరకు రాయితీ వచ్చే అవకాశం ఉంది.
ముగింపు
ఈ ప్తకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.ఈ పథకం ద్వారా కొత్త ఉపాధి మరియు ఉన్న ఉపాధిని పెంచుకునే అవకాశం కల్పిస్తోంది .