Osmania University Phd Entrance Exam notice: పీహెచ్డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల 2

Photo of author

By Admin

Table of Contents

Osmania University Phd Entrance Exam notice

పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.జనవరి 30వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

  • ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం – 30 జనవరి 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ – 1 మార్చి 2025
  • రూ. 2వేల ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ – 11 మార్చి 2025.
  • మార్చి చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి.

ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 50 శాతంతో మిగిలిన వారు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 70 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి.

పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్టుకు అర్హత ఉన్న అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.హోం పేజీలో కనిపించే PhD Entrance Test 2025 లింక్ పై క్లిక్ చేయాలి.ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ముందుగా Application Fee Payment పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంట్రీ చేయాలి.చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు. అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇంకా డిగ్రీ ఫలితాలు వెలువడని వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు పిహెచ్‌డి ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించారు

Apply Now
Download Notification

Leave a Comment