New Virus Attacked in Jummu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో వింత జబ్బు 17కు చేరిన మృతుల సంఖ్య
జమ్మూ కాశ్మీర్లో విషవ్యాధి వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఈ మిస్టీరియస్ రోగంతో ఒకే గ్రామంలో 2 కుటుంబాల్లో 8 మంది మరణించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
రైతు ప్రస్థానం : JK రాజౌరీ (D) బాదాల్లో వేధిస్తున్న వింత జబ్బుతో ప్రభుత్వం తలపట్టుకుంది. మహ్మద్ అస్లామ్ ఇంట ఆరో బిడ్డ చనిపోవడంతో మృతుల సంఖ్య మొత్తం 17కు చేరుకుంది. DEC 17 నుంచి ఈ మారణహోమం కొనసాగుతోంది. డిసెంబర్లో ఓ 2 కుటుంబాలు తద్దినం వంటిది ఏర్పాటు చేసి భోజనాలు చేశాయి. అప్పట్నుంచి వరుసగా పిల్లలు, పెద్దలు చనిపోతుండటంతో మొబైల్ లేబొరేటరీని పంపారు. ఇప్పుడు HM అమిత్ షా కేంద్ర, రాష్ట్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు.ఈ మిస్టీరియస్ రోగంతో ఒకే గ్రామంలో 2 కుటుంబాల్లో 8 మంది మరణించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏంటో తెలియదు? ఎలా వస్తుందో తెలియదు? ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నా రోగులు చనిపోతుండటం, ఒకర్నుంచి మరొకరికి సోకుతుండటం కలవరపెడుతోంది. దీంతో ప్రభుత్వం హుటాహుటిన BSL-3 మొబైల్ లేబోరేటరీని అక్కడికి పంపించి పరిశోధనలు చేయిస్తోంది.ఈ వైరస్ దేశం మొత్తం వ్యాపించక ముందే అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగ పనిని ప్రారంభియించింది మరో రెండు మూడు రోజుల్లో వ్యాధి సంభందించిన వివరాలు తెలియనున్నాయి ..











Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?