New Teachers are terminated without reasons: CM రేవంత్ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రం వెంటనే టెర్మినేషన్ పత్రం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అటాహసంగా ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేసింది అయితే ఒక దగ్గర నియామక పత్రాలు ఫేక్ అంటూ విధుల నుంచి తొలగించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేసింది వారు కూడా నియామక పత్రాలను తీసుకుని సంబంధిత స్కూల్ లలో రిపోర్టింగ్ చేశారు కొన్ని రోజులు గడిచాక ఇవి ఫేక్ పత్రాలు అంటూ విద్యాశాఖ అధికారులు చెప్పబడి అక్కడి నుంచి వారిని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలపై నమ్మకం లేకుండా పోయింది. ఎంతో వట్టవసరంగా గందరగోళంగా నియామక పత్రాలు అందజేశారు అంటూ పలువురు అధ్యాపకులు వాపోతున్నారు.
ఇటీవల ఏడుగురు హిందీ పండిట్ టీచర్లను టర్నెట్ చేస్తున్నట్టు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇది ఖమ్మం జిల్లాలో జరిగింది. దీంతో ఉద్యోగుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలు ద్వారా గందరగోళం ఏర్పడింది. డీఎస్సీ ద్వారా నియామక పత్రాలు అందజేత మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. సంబంధిత ఉద్యోగులు ఉద్యోగం పొంది ఇంకా నెల కూడా పూర్తి కాకుండానే టెర్మినేషన్ అందుకున్నారు.
డీఎస్సీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో విద్యాశాఖ మూడుసార్లు స్కూటీ చేసిన తర్వాతనే విధుల్లోకి తీసుకుంది కానీ ఇప్పుడు అదే విద్యాశాఖ ఎందుకు ఇవి ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పింది అంటూ ఉద్యోగులు అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పుడు నిబంధనల ప్రకారం హిందీ పండిట్లు అర్హులు కారని ఎలా అంటున్నారు విద్యాశాఖ అని క్యూస్షన్ చేశారు. హిందీ పండిట్లయినా ప్రవీణ్ విశారద భూషణ్ వీరు అర్హులు కాదంటూ విద్యాశాఖ ఎలా చెబుతుంది అని ఎంపికైన టీచర్స్ మండిపడుతున్నారు.
ఉద్యోగాలకు వచ్చి 25 రోజులు కాకముందే టెర్మినేషన్ అయినా ఏడుగురు హిందీ పండిట్లలైన ఉద్యోగాలు టర్మినెట్ అయిన హిందీ పండిట్ ఉద్యోగులు మయూరి నాగేశ్వరావు, సట్టు రామలింగయ్య, షేక్ నాగుల్ మీరా, దోర్నాల లావణ్య, తాటికొండ నాగలక్ష్మి, తాటికొండ శ్రీదేవి, మెండేటి వెంకట రత్నం. జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పిద నిర్ణయంతో ఏడుగురు ఉపాధ్యాయుల జీవితాలు అయోమయంలో పడ్డాయి.ఇప్పుడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలను నమ్మాలా వద్దా అనేది అభ్యర్థులు గందరగోళంగా నెలకొంది సీఎం ఏమో ఇవి మీ ఒరిజినల్ నియామక పత్రాలు అని సీఎం చెప్తారు కానీ విద్యాశాఖ మంత్రం స్క్రూటినీ చేసిన తర్వాత కూడా మీరు అర్హులు కారని ఎలా అంటారు అని అభ్యర్థులు మండిపడుతున్నారు దీనిపై సీఎం స్పందించి వెంటనే మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.మొదటి సారిగా నియమించిన ఉద్యోగులను 25 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం టెర్మినేట్ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావొచ్చు.