New ration cards: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ షురూ చేసిన ప్రభుత్వం
కొత్త రేషన్ కార్డులకు సంభందించి దరఖాస్తులను స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ
New ration Cards
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరగా నెరవేరుస్తూ వస్తోంది.ఇప్పటికే ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచింది,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఇంటింటికీ ఉచిత విద్యుత్ ,ప్రతి మహిళకు 2500 రూపాయలను అందిస్తోంది.ఇప్పటికే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీనీ మూడు విడుతల్లో చేసింది.ఇంకా కొంతమంది రైతులకు మాఫీ చేసే అవకాశం ఉంది.రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రత్యేకంగా ఆప్ నీ తీసుకు వచ్చింది.ఈ యాప్ లో రైతుకు రుణమాఫీ ఎందుకు కాలేదు. ఏ విధమైన సంకేతికలోపం ఉంది అనేది పరిశీలించి వ్యవసాయ అధికారులు రైతు యొక్క వేలిముద్రలతో పాటుగా అతని భూమికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.దీని ద్వారా రైతు భరోసా ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు అని అంటున్నారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పై తమ దృష్టిని అయితే పెట్టింది.రాష్ట్రంలో చాల మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై గుడ్్న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరలను CM ఆదేశించారు.
ఈ నెల 21 నా సీఎం అధ్యక్షతన ఈ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది.ఈ క్యాబినెట్ మీటింగులో రెవిన్యూ చట్టం సవరణ ఇన ముసాయిదా బిల్లు ror చట్టాన్ని అమలు ప్రక్రియ గురించి వ్యవసాయ అధికారులతో ఈ చర్చ జరగనుంది.అలాగే కొత్త రేషన్ కార్డులకు సంభందించి ఆర్థికంగా ఉన్న పాత నిబంధన ఉంచల లేఖ కొత్త నిబంధనలను అమలు చేయాలి అనేది ఈ మీటింగ్ లోన్ చర్చించ నున్నారు.అంతే కాకుండా రైతులకు రైతు భరోసా హామీ అయినా 15000 రూపాయలను ఈ విధంగా రైతులకు అందించాలి నిభందనలు ఏంటి అనే దాని గురించి ఈ మీటింగులో చర్చించనున్నారు.
అంతే కాకుండా ఈ మీటింగులో ఇంకో 15 అంశాల గురించి చర్చా జరగనుంది అనేది సమాచారం.
ఈ నెల 21 నా జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డులు అమలవుతాయే అనేది ప్రజలకు నమ్మకం కుదిరింది.కొత్త రేషన్ కార్డపై ఆశలు చిగురిస్తున్నాయి అనే చెప్పొచ్చు.
రైతూ భరోసా అమలు కోసం రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు ప్రజ ప్రతినిధులు రైతుల నుంచి సలహాలు సూచనలు సేకరించారు.వాటిని పరిశీలించి కేబినెట్లో రైతు భరోసా ఇచ్చే తేదీని ప్రకటించవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలి అని అధికారులను ఆదేశించారు. ఈ మీటింగ్ అనంతరం కొత్త రేషన్ కార్డులు అం

దుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.