Minister Sridhar Babu Said to Mee seva employees : మీసేవ ఆపరేటర్లకు గుడ్ న్యూస్
మీసేవ ఆపరేటర్లకు రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వం మీసేవ ఆపరేటర్లకు మద్దతుగా చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు మీసేవ ఆపరేటర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 4,754 మీసేవ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఆపరేటర్లకు పర్మనెంట్ ఉద్యోగాలుగా మారుస్తామని ఆయన తెలిపారు. మీసేవ ఆపరేటర్ల 14వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలైన ఆరు గ్యారెంటీలను ఇప్పుడు అమలు చేసే పనిలో పడింది అని చెప్పారు
. ప్రభుత్వం మీసేవ ఆపరేటర్లకు మద్దతుగా సంక్షేమ బోర్డులో చురుకుగా పనిచేస్తుందని తెలిపారు వచ్చే రోజుల్లో మీ సేవకు ఇన్కమ్ పెంచుతామని ఆయన స్పష్టం చేశారు అలాగే మీ సేవలో ఇప్పుడు ఇస్తున్న పర్సెంటేజ్ కన్నా ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ సేవ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని దీని ద్వారా ప్రతి ఒక్కరికి కార్యాలయానికి వెళ్లి చేసుకునే పనుల భారం తగ్గిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రతి పల్లె నుంచి మొదలుకొని జిల్లాల వరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి దగ్గరే కూర్చొని పనులు చేసుకుంటున్నారని మీసేవ రావడం వల్ల దాదాపు కార్యాలయాల చుట్టూ తిరిగేటటువంటి పని భారం తప్పిందని దీని ఇంకా ప్రగతిపదిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మీసేవ ఇప్పుడు ప్రభుత్వాలకి ప్రభుత్వ కార్యాలయానికి ఒక వారధిలోగా మారిందని ప్రభుత్వం అందించేటటువంటి ప్రతి ఒక్క స్కీము మరియు సర్టిఫికెట్స్ ఇంటి దగ్గరే కూర్చొని ఒకసారి అప్లై చేసి మీ సేవలో ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చని తెలిపారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని శ్రీధర్ బాబు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందన్నారు. ఆర్థిక స్థిరత్వంతో దూసుకుపోతోందని వివరించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని కోరారు. మీసేవా ఆపరేటర్లు అంకితభావం పని చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ బోర్డు ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మీసేవ సిబ్బందికి శాశ్వత పాత్రలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మీసేవ ఆపరేటర్లకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు చేస్తామని అలాగే మీ సేవ సెంటర్లలో వారికి వచ్చే పర్సంటేజ్ని మరింత పెంచే విధంగా నిర్దేశం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడుతామని ఐటి శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలపడం జరిగింది.
FAQ