తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం| Madhapur new HCL Tech’s Global Delivery Center 2025

Photo of author

By Admin

Madhapur new HCL Tech’s Global Delivery Center

“రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది.

హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా, రాష్ట్రంగా మారిందని చెప్పారు.హైదరాబాద్ పోటీ.. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నగరాలతో కాదని, ప్రపంచ స్థాయి నగరాలతో తమ పోటీ అని అన్నప్పుడు అదో పెద్ద కలగా అభివర్ణించారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న తీరు నంబర్ 1 గా నిలిచినప్పుడు, రాష్ట్రాన్ని డేటా సెంటర్ల హబ్‌గా, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్, స్కిల్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణను మార్గదర్శిగా మార్చినప్పుడు ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ఇక హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ ఆగదు.

బహుళజాతి కంపెనీలతో ప్రతి రోజూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా పెద్ద పెద్ద సంస్థలు Hyderabad కు రావడం లేదా గతేడాది కుదుర్చుకున్న ఎంఓయూల మేరకు సరికొత్త సౌకర్యాలతో సిద్ధమైన కేఆర్‌సీ సెంటర్ (HCL Tech KRC Campus ) ను ప్రారంభించడం గర్వకారణంగా ఉంది. కేవలం ఏడాది కాలంలోనే Telangana అంతర్జాతీయ, దేశీయ అత్యధిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్‌ను ముందుగా అందిపుచ్చుకున్నాం. పైగా రాష్ట్రంలో తక్కువ ద్రవ్యోల్బణాన్ని కాపాడుకున్నాం.2007 లో హైదరాబాద్‌లో తొలిసారి ప్రారంభమైనప్పటి నుంచి అభివృద్ధి సాధిస్తూ ప్రస్తుతం 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 వేల మంది ఉద్యోగులతో ప్రపంచస్థాయి సరికొత్త సదుపాయాలతో హైదరాబాద్ హెచ్‌ఎసీఎల్ (HCL Tech) అద్భుతమైన విజయాలను సాధించబోతోంది” అని వివరించారు.

తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మార్చుతామని చెప్పినప్పుడు కొందరు సాధ్యం కాదన్నారు. కేవలం దావోస్ లో జరిపిన రెండు వ్యాపార పర్యటనల్లో 40 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు, 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. ప్రపంచంలోనే అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ సంస్థల్లో ఒకటైన ఆమ్‌జెన్ (Amgen)ను హైదరాబాద్‌కు ఆహ్వానించాం. ప్రపంచంలోనే అత్తుత్తమ జీవ వైవిధ్య సదస్సుల్లో ఒకటైన బయో ఏషియా 2025 ( Bio Asia 2025)ను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు హెచ్‌సీఎల్ క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నాం. 60 దేశాల్లో డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్, AI రంగాల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ దేశ గౌరవాన్ని పెంచింది.

Leave a Comment