Kakani Somi Reddy About AP Farmers కరెన్సీ నోట్ల కట్టల ప్రవాహం కాలువలో ప్రవహించకుండా ఆగిపోయిన సాగునీరు 2024

Kakani Somi Reddy About AP Farmers కరెన్సీ నోట్ల కట్టల ప్రవాహం కాలువలో ప్రవహించకుండా ఆగిపోయిన సాగునీరు.

సోమిరెడ్డి నివాసానికి తరలివెళ్తున్న కరెన్సీ నోట్ల కట్టల ప్రవాహం పుణ్యమా! అని కనుపూరు కాలువలో ప్రవహించకుండా ఆగిపోయిన సాగునీరు.

సోమిరెడ్డి అవినీతికి అద్దం పడుతూ, ఆధారాలు, లొకేషన్స్ తో సహా కాలువల దుస్థితిని కళ్లకు కట్టినట్లు బహిరంగంగా చూపించడంతో, తట్టుకోలేని సోమిరెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడాలంటూ, టిడిపి శ్రేణులను ఉసిగొల్పుతున్నాడు.కనుపూరు కాలువ దుస్థితి, కసుమూరు గ్రామం రైతుల నుండి సేకరించిన సమాచారం, ఆధారాలతో కూడిన ఫొటోలతో సహా ఇందువెంట బహిర్గతం.కనుపూరు కాలువ దుస్థితిని, చూసి తట్టుకోలేక, గోడు వెల్లబోసుకుంటున్న రైతులు.సోమిరెడ్డి అవినీతి పుణ్యమా! అని పూడికతీత పనులు చేపట్టకుండానే, 6 కోట్ల రూపాయలు స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడంతో, కాలువ గుండా నీరు ప్రవహించకుండా ఆగిపోవడంతో, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు.

టెండర్ల కాల పరిమితి ముగియకుండానే సోమిరెడ్డి కొడుకు కాంట్రాక్టర్ అవతారమెత్తి, పనులు ప్రారంభించి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను బెదిరిస్తూన్నా సోమిరెడ్డికి వంతపడుతూ మామూళ్ల మత్తులో జోగుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు.ఇరిగేషన్ శాఖ అధికారులు సోమిరెడ్డితో లాలూచీపడి టెండర్లు తెరవకుండా, పూడికతీత పనులు చేపట్టకుండా, అర్ధాంతరంగా నీళ్లు వదిలి, “దొంగలు – దొంగలు ఊర్లు పంచుకున్న” చందంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.తెలుగుదేశం నాయకులు రైతుల వేషధారణలో సోమిరెడ్డిని పొగుడుతూ గత ప్రభుత్వంపై దూషిస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై సోమిరెడ్డిని.. ఛీ.. కొడుతున్న రైతులు. సంపాదన పై ఉన్న ధ్యాస రైతులపై వ్యవసాయంపై లేదంటూ అవసరమైన చోట్ల తమ సొంత ఖర్చులతోనే కాలువల్లో పూడిక తీయించుకొని సాగునీటి అవసరాలను తీర్చుకుంటున్న రైతులు.రైతుల వేదనను చూసి ప్రజలకు హృదయం చలిస్తున్నా సోమిరెడ్డి ఇరిగేషన్ అధికారులు అందరూ కలిసి ఒకటై ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేయడమే పరమావధిగా భావిస్తున్నారంటున్న రైతులు.

టెండర్లు వేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తూ, బెదిరింపులకు లొంగని కాంట్రాక్టర్లు వేస్తున్న టెండర్లను రద్దు చేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్న రైతులు.సోమిరెడ్డి 2024 – 2025 ఆర్థిక సంవత్సరంలోనే, ప్రభుత్వ సొమ్ము 32 కోట్ల రూపాయలు, ఇరిగేషన్ పనులలో జేబులో వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రణాళిక సిద్ధం.సోమిరెడ్డి దోపిడీకి అడ్డు, అదుపు లేకుండా పోయిందని, రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం అన్యాయమంటూ, మౌనరోదనలో రైతులు.

Leave a Comment