జనసేన సభకు అనుమతి నిరాకరణ: తెలంగాణ ప్రభుత్వంపై పార్టీ తీవ్ర ఆగ్రహం | janasena-telangana-meeting-permission-denied 2026

janasena-telangana-meeting-permission-denied

తెలంగాణలో జనసేన పార్టీ శ్రేణులతో నిర్వహించాలనుకున్న “నవ నిర్మాణ సంకల్ప సభ”కు రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇండోర్ సమావేశానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంపై జనసేన నాయకత్వం సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది.

అనుమతి నిరాకరణపై జనసేన లేవనెత్తిన ప్రశ్నలు

ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ జనసేన పార్టీ శ్రేణులు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి:

  • పార్కింగ్ సాకు అర్థరహితం: గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ప్రతిరోజూ ఎన్నో రకాల సామాజిక, రాజకీయ, వ్యాపార సమావేశాలు జరుగుతుంటాయని.. కానీ జనసేన సభ అనగానే ఎప్పుడూ లేని ‘పార్కింగ్ సమస్య’ను కారణంగా చూపించడం ముమ్మాటికీ వివక్షేనని పార్టీ పేర్కొంది.

  • ప్రాంతీయ సెంటిమెంట్లపై ప్రశ్నలు: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చినప్పుడు లేని ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇప్పుడు జనసేన పుట్టిన నేలపై పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుంటే వచ్చాయా? అని ప్రశ్నించింది.

  • ఇండోర్ సభలకూ ఆంక్షలా?: బహిరంగ సభలకు కాకుండా కేవలం ఇండోర్ హాల్‌లో పరిమిత సంఖ్యలో చేసుకునే సమావేశాలకు కూడా అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని జనసేన ఫైర్ అయింది.

  • Youtube Channel: Click Here
  • Horror Stories: Click Here
  • Entertainment: Click Here

Leave a Comment