Harish Rao fire on CM Revanth Reddy Pharmacity: ఒకప్పటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన తీరుగా ఇప్పుడు ఈ పాలన
గత ప్రభుత్వం ఫార్మసిటీ కోసం 14 వేల ఎకరాల భూమిని సేకరించింది కదా ఆ భూమిలో ఎందుకు ఫార్మాసిటీ పెట్టకూడదు అంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వికారాబాద్ లో హై టెన్షన్ అయితే నెలకొంది వికారాబాద్ లో కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ షార్ట్ సీటు ఫైల్ చేయడంపై టిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఇది కేవలం కుట్ర కోణంతో చేస్తున్నారని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నాశనం అవుతుందని కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులు చేస్తున్నారని అన్నారు ఫార్మాసిటీని సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వం 14 వేల ఎకరాలను సేకరించిందని ఆ 14 ఎకరాల్లో ఫార్మాసిటీ కడితే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల దగ్గర్నుంచి భూమిని లాక్కొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములను పంచితే ఈరోజు ఆమె పేరు చెప్పుకొని సీఎం రేవంత్ రెడ్డి భూములను లాక్కుంటున్నారని అన్నారు. మమ్ములను నేరుగా ఎదుర్కొని అవకాశం లేక ఎదుర్కొనే ధైర్యం లేక మా కేటీఆర్ పైన అసంత ప్రసారాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
నీ ప్రభుత్వం పైన ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నియోజకవర్గం నుంచి మొదలైందని మా పట్నం నరేందర్ రెడ్డి పైన కేసులు పెట్టావు మా కేటీఆర్ పైన కుట్రలు చేస్తావు కావచ్చు అని నువ్వు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా తిరుగుబాటు చేస్తూనే ఉంటామని నిన్ను గద్దతించే వరకు తిరుగుబాటు చేస్తామని ప్రజలు తిరుగుబాటు కొనసాగిస్తూనే ఉంటారని హెచ్చరిస్తున్నామని అన్నారు.కొడంగల్ వైపు ఫార్మసిటీని ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేద్దామని తమ వాళ్లనీ కోటీశ్వరులుగా మారుద్దామని చూస్తున్నారని అన్నారు తమ తమ్ముళ్ళని అల్లుళ్ళని తమ స్నేహితులను లక్షణాది ప్రజలను వదిలిపెట్టి తమ వైపు మాత్రమే మంచి చీకురాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
ఆల్రెడీ గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మసిటీ కోసం సేకరించామని అందులో ఫార్మాసిటీ పెట్టాలన్నారు. ఇందిరమ్మ దళితులకు, గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి వారి భూములను లాక్కోవాలని చూస్తున్నారన్నారు. భూములను గుంజుకోవడమే ఇందిరమ్మ పాలననా అని ప్రశ్నించారు.ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు కొడంగల్ నుంచే ప్రారంభమైందని మాజీ మంత్రి హరీశ్రరావు అన్నారు.ఇది ఒకప్పటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన తీరుగా ఇప్పుడు ఈ పాలన కూడా కనిపిస్తుందని ఆయన అన్నారు.