GBS virus symptoms and present cases in india
మహారాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్ మరో మరణం సంభవించింది. నాందేడ్లో 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో GBS మరణాల సంఖ్య 5కు పెరిగింది.
దేశంలో మరోమారు వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.మహారాష్ట్రలోని నాందేడ్ లో 60 ఏళ్ల వృదుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు దీంతో ఆ రాష్ట్రంలో ఈ వైరస్ భారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు పుణేలో కేసుల సంఖ్య 149కి చేరింది. తాజాగా అస్సాంలో తొలి GBS మరణం నమోదైంది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఓ మహిళ ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.
వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందిస్తే బాధితులు పూర్తిగా కోలుకుంటారని, ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు.మహారాష్ట్రలో విజృంభిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె HYD కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి కాదని, నయం చేయవచ్చని తెలిపారు.
వ్యాధి లక్షణాలు..
కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో నొప్పి, తిమ్మిరి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, జలుబు, కడుపు నొప్పి గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారని డాక్టర్లు తెలిపారు.