మాజీ సీఎం కెసిఆర్ బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ | Former CM KCR reached Telangana Bhavan 2025 | Rythu Prasthanam

Former CM KCR reached Telangana Bhavan

గులాబీ బాస్ కేసీఆర్ 17 నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

నగరంలోని తెలంగాణభవన్లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్కు క్యూ కట్టాయి.భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవనానికి ఈ కార్యక్రమానికి భారీ త్తున కార్లు మరియు కార్యకర్తలు భవనానికి చేరుకుంటున్నారు దీంతో భారీగా ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Comment