Finance Minister Nirmala Sitharaman New Machin కొత్త మిషన్లను ప్రకటించిన కేంద్రం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కొత్త మిషన్లను ప్రకటించారు. అవి..
⇒ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు అందించడం, నీటిపారుదల పెంచడం, భూమిని సారవంతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. 100 జిల్లాల్లో దీనిని అమలు చేయనున్నారు.
⇒ నేషనల్ కాటన్ మిషన్: అధిక ఉత్పత్తి వంగడాల కోసం ముఖ్యంగా పత్తి ఉత్పాదకతను పెంచేందుకు దీనిని ప్రకటించారు. పత్తి విత్తనాలు, ఉత్పత్తి పెంచేలా ఈ మిషన్ పనిచేయనుంది.
⇒ ఎగుమతుల ప్రోత్సాహక మిషన్: భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు రూ.2,250కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఏర్పాటు చేయనున్నారు.
⇒ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్: పరిశ్రమలను ప్రోత్సహించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో వలసలను తగ్గించడానికి దీనిని ఏర్పాటు చేయనున్నారు.
⇒ అర్బన్ ఛాలెంజ్ ఫండ్: నగరాలను, పట్టణాలను వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తారు.
⇒ జాతీయ అణుశక్తి మిషన్: చిన్న స్థాయి నుంచి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషనన్ను ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.20వేల కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2047 కల్లా 100 గిగావాట్ల అణువిద్యుత్ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
⇒ క్లీన్ టెక్ మిషన్: క్లీన్ టెక్నాలజీ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆర్థికమంత్రి ఈ మిషన్ను ప్రకటించారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, గ్రీన్ టెక్నాలజీని అభిృద్ధి చేయడంపై దృష్టి పెడతారు.
⇒ జ్ఞాన భారతి మిషన్: ఆహార భద్రత కోసం ఈ మిషన్లో భాగంగా రెండు జన్యు బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు.
⇒ నేషనల్ మారిటైమ్ ఫండ్: రూ.25వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ను ఏర్పాటు చేశారు. ఇందులో 49% ప్రభుత్వం, మిగతా 51% నిధులను ప్రైవేట్, పోర్టులు సమకూరుస్తాయి. ఈ ఫండ్ ద్వారా 2030 నాటికి భారత నౌకా రంగం రూ.1.50లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది.
⇒ గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్: వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం పర్యావరణ మంత్రిత్వశాఖకు రూ.3,412.82 కోట్లు, గ్రీన్ ఇండియా నేషనల్ మిషను రూ.220 కోట్లు, సహజ వనరుల పరిరక్షణకు రూ.50కోట్లు కేటాయించారు.
⇒ జాతీయ భౌగోళిక మిషన్: భౌగోళిక మౌలిక సదుపాయాలు, డేటా అభివృద్ధికి రూ.100కోట్లతో జాతీయ భౌగోళిక(జియో స్పేషియల్) మిషన్ ఏర్పాటు చేయనున్నారు. భూముల రికార్డులు, పట్టణ ప్రణాళికలను ఆధునీకరించడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన సులభం చేయడమే ఈ మిషన్ ఉద్దేశం.