CM Revanth Reddy Dwakra 2 lakhs Loans Waiver
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించడమే కాకుండా ప్రమాద భీమా కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఒకసారి తెలుసుకుందాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం మరియు 2500 రూపాయలను మహాలక్ష్మి స్కీం కింద అందించింది.అంతేకాకుండా మర్చి 9న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు ఆర్ధిక భరోసా ఐన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ పథకం కింద ఎంతో మంది మహిళలు కోటీశ్వరులుగా మారబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఆశ భావం వ్యక్తం చేశారు.అలాగే ఇదే స్కీం కింద రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్ధిక బీమాను కల్పించారు ఎలా అని అనుకుంటే ఇవి చదవండి.
ఆర్ధిక భీమా
ఇంతకూ ముందు ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూసింది అంటూ మంత్రి సీతక్క రోడ్డెక్కిన విషయం తెలిసిందే ఐతే ఆ సమయాన్ని గుర్తుంచుకొని సీతక్క డ్వాక్రా మహిళలకు బీమాను కల్పించడంతో పలు సదుపాయాలను ఈ పథకం కింద కల్పించినంధీ అందులో ముఖ్యంగా ప్రమాద భీమా 12 లక్షలు.
భీమా ఎలా పొందాలి
మహిళలకు భీమా కింద రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయలను అందించనుంది.దానికోసం అని కొన్ని నియమ నిబంధనలను ఖరారు చేసింది.
- ప్రమాదం జరిగి మహిళా మరణింస్తే 10 లక్షల రూపాయలను తమ కుటుంభానికి అందిస్తుంది.అలాగే 2 లక్షల వరకు మహిళా పేరుమీద బ్యాంకు రుణమా ఉంటె ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- ప్రమాదం జరిగి 50% వైకల్యం ఏర్పడితే (అంటే కొన్ని పనులు తానూ చేసుకోగలిగితే ) 5 లక్షల రూపాయలను భీమగా అందిస్తుంది.అదే ప్రమాదంలో మహిళా 100% వైకల్యం ఏర్పడితే 10 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది.దానితో పాటుగా 2 లక్షల బ్యాంకు రుణాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- ఇవన్నీ పొందాలి అంటే ఆ మహిళా తెలంగాణ వారై ఉండాలి మరియు ఆమె ఏదైనా ఒక మహిళా సంఘంలో సభ్యురాలై ఉండాలి.
ఎవరికీ భీమా వర్తించదు
- మహిళా సంఘంలో సభ్యత్వం లేని వారికి ప్రభుత్వం అందిస్తున్న ఈ భీమా వర్తించదు.
- అలాగే మహిళా సాధారణంగా మరణిస్తే ఏజ్ బారై చనిపోవడం లేదా హఠాత్తుగా చనిపోవడం లేదా నిద్రలోనే చనిపోవడం కేవలం బ్యాంక్లో లోన్ ఉంటె 2 లక్షల వరకు మాఫీ అందుతుంది.