Awareness Prevention of Pollution and Feticide : కాలుష్య నివారణ మరియు భృణ హత్యలపై అవగాహనా సదస్సు
మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ (GERHARD DOMAGK) గెర్హార్డ్ డొమాక్ సేవలు చిరస్మరణీయం
ప్రపంచ రెడ్‌క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ హెన్రీ డ్యూనాంట్ సేవలు చిరస్మరణీయం
భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి
ప్రజలకు వాతావరణ కాలుష్యం పై, ఆరోగ్యం, పలు ఆంశాల పై అవగాహన సదస్సు
ప్రజలు ప్రతిఒక్కరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి, ప్లాస్టిక్ ని వాడకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి
పిసి పీఎన్‌డీటీ చట్టం పై, కాలుష్యం పై ప్రజలకు అవగాహణ సదస్సు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి బేతంచర్ల ప్రభుత్వ వైద్యశాల బుధవారం ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ స్వప్న వాణి ప్రియ,నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు ఈ సి. నాగసురేంద్ర.
Rythu Prasthanam 31 October 2024 : అక్టోబర్ 30 న మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ (GERHARD DOMAGK) గెర్హార్డ్ డొమాక్ గారి జయంతి సందర్భంగా*మరియు *ప్రపంచ రెడ్‌క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ హెన్రీ డ్యూనాంట్ వర్థంతి సందర్బంగా*మరియు*పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై, కాలుష్యం పై ప్రజలకు అవగాహణ సదస్సుబేతంచేర్ల పట్టణం:-బేతంచెర్ల ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త బేతంచెర్ల ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం ఇంచార్జి మెడికల్ ఆఫిసర్ డాక్టర్ ఎం.స్వప్నవాణి ప్రియా, డాక్టర్ వెంకటేశ్వర్లు అద్యక్షతన అక్టోబర్ 30 ప్రపంచ రెడ్‌క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ హెన్రీ డ్యూనాంట్ వర్థంతి సందర్బంగా మరియు మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ గెర్ హర్డ్ డొమాక్ (GERHARD DOMAGK)గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ సిస్టర్స్ కవిత , మెర్సి, కుమారి , కళ్యాణి బాయ్, రెడ్ క్రాస్ సభ్యులు దశరథ ,వెంకట రమణయ్య ,సురేంద్రబాబు, శివ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా బేతంచర్ల ప్రభుత్వ వైద్యశాల బుధవారం ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ స్వప్నవాణి ప్రియ మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు ఈ సి. నాగసురేంద్ర కోరారు.
=> డొమాగ్క్ అక్టోబర్ 30, 1895న జన్మించారు. ఈయన బాక్టీరియాలజిస్ట్ మరియు పాథాలజిస్ట్ సల్ఫోనామైడ్స్ యాంటీ బాక్టీరియను ఆవిష్కరించారు. మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్నందున కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడారు. డాక్టర్ డొమాగ్క్ ఏప్రిల్ 24, 1964 న స్వర్గస్తులైనారు. ఇలాంటి మహానుభావులను ఎల్లవేళల స్మరించుకుంటు వారి అడుగుజాడలలో నడవాలని , సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి , మెడికల్ ఆఫీసర్ ఎం స్వప్నవాణి ప్రియా,నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు ఈ సి. నాగసురేంద్రలు కోరారు.
=> జీన్-హెన్రీ డునాంట్ 8 మే 1828 జన్మించారు. మానవతావాది, వ్యాపారవేత్త మరియు సామాజిక వేత్త. అతను రెడ్ క్రాస్ యొక్క వ్యవస్థాపకులు అతనుమొదటి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక విపత్తుల ద్వారా బాధపడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడానికి అన్ని ప్రభుత్వాలు మరియు స్వచ్చంద సంస్థలు క్రియాశీల సభ్యులుగా మారి సహయం చేస్తున్నాయి. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్ధ ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్ధగా ఖ్యాతిని గడించింది. హెన్రీ డునాంట్ గారు (Henry Dunant-) 30 అక్టోబర్ 1910 స్వర్గస్తులైనారు. ఇలాంటి మహానుభావులను ఎల్లవేళల స్మరించుకుంటు వారి అడుగుజాడలలో మెడికల్ ఆఫీసర్ ఎం. స్వప్నవాణి ప్రియ కోరారు.
భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి
=> పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై ప్రజలకు బేతంచర్ల ప్రభుత్వ వైద్యశాల బుధవారం ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ స్వప్న వాణి ప్రియ, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి లు అవగాహణ కల్పించారు.
ఇటీవలి కాలంలో దేశంలో గణాంకాలు పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు వల్ల దంపతులు మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావించడం వల్ల ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతున్నా కారణంగా ఇలాంటి హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం 1994లో పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పై పూర్తిస్థాయిలో అవగాహనతో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై సమాచారం అందించడానికి సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఈ చట్ట అమలుకు సహకరించాలని బేతంచర్ల ప్రభుత్వ వైద్యశాల బుధవారం ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ స్వప్న వాణి ప్రియ,సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. ఆడ మగ ఇద్దరూ సమానమేనని, లింగ వివక్ష చూపడం నేరమేనని అన్నారు. ఆడబిడ్డలను పుట్ట నిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం బేతంచర్ల ప్రభుత్వ వైద్యశాల బుధవారం ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ స్వప్న వాణి ప్రియ,సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. అలాగే ప్రజలకు ఆరోగ్యం పై అవగాహణ కలిపించారు.
ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని,తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని ,శరీరాని తగ్గట్టుగా నీళ్ళు త్రాగాలని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి.దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమకాటు నుంచి వచ్చే విష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి.
వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ – ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించాలి. క్రమం తప్పకుండా సరైన సమయానికి టీకాలు వేయించాలి. చిన్నప్పుడు నుంచే పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.