AP Thalliki Vandanam Scheme Starting next year
ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు.
రైతు ప్రస్థానం : ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేయబోతున్నట్లు తెలిపింది.అసెంబ్లీ ఎలేచ్షన్స్ లో చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం చేస్తాం అని తెలిపింది ఆ హామీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం) పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.
2.0 అంటూ జగన్ కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘జగన్ అంటున్నట్లు అది 2.0 కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. జగన్ ఎన్నో ప్యాలెస్లు కట్టించుకున్నారు. TDP సంగతి తర్వాత చూద్దువు.. ముందు మీ పార్టీ సంగతి చూడండి’ అని సోమిరెడ్డి హితవు పలికారు.