AP Farm Fund Scheme Details 75 thousand subsidy కొత్త పథకం ద్వారా రైతులకు 75 వేల రూపాయల వరకు సబ్సిడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రైతులకు 75 వేల రూపాయల వరకు సబ్సిడీని ఇచ్చి వారికి సహాయపడునుంది దీనివల్ల నీటి ఎద్దడి కొంతమేర తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ పథకం పేరు ఏపీ ఫారం ఫండ్ ఈ పథకాన్ని చిత్తూరు జిల్లా వంటి నీటి ఎద్దడి ప్రాంతాల్లో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికోసం అని రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రారంభించడం జరిగింది.నీటి నిల్వకు అవసరమైన ఫారం ఫండ్‌ల ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తుంది.కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగులో నీటి కొతర సమస్యలను పరిష్కరించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.
వివరణ:
AP Farm Fund Scheme Details : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది దీని వల్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 75,000 వరకు సబ్సిడీని ఇచ్చి వారికి ఫారం ఫండ్ ద్వారా నీటి కొరత సమస్యలు తీర్చడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యానవనా పంటల సాగులో నీటి కొలత సమస్యలను పరిష్కరించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.ఉద్యాన పంటలు పండించే రైతుల ఖాతాల్లో ఈ పథకం ద్వారా డబ్బులు జమ కానున్నాయి.ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం
- నీటి లభ్యతను పెంపొందించడం
- పంట దిగుబడిని మెరుగుపరచడం
- నీటి నిల్వ కోసం ఫారం పాండ్‌లను సృష్టించే ఖర్చును సబ్సిడీ చేయడం
- రైతును ఆర్థికంగా ఆదుకోవడం
ఫారం ఫౌండ్ నిర్మాణానికి కావలసిన కొలతలు
- పొడువు: 20 మీటర్లు
- వెడల్పు: 20 మీటర్లు
- లోతు: 3 మీటర్లు
- జియో మెంబ్రేన్ షీట్ (500 మైక్రాన్లు) ఉపయోగించి 12 లక్షల లీటర్ల వరకు నీటి నిల్వ చేస్తారు.వేసవి కాలంలో రెండు ఎకరాల్లో రెండు పంటలకు సరిపడా నీటిని అందించగల సామర్థ్యం ఉంటుంది.
సబ్సిడీ
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు 50 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనుంది.చెరువు నిర్మాణానికి మొత్తం ఖర్చు రూ.1.50 లక్షలు కాగా.. రైతు తన వాటా కింద రూ.75 వేలు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రూ.75 వేలు అందిస్తుంది.
అప్లై చేసుకోవడానికి అవసరమైన పత్రాలు
- ల్యాండ్ టైటిల్, పాస్‌పుస్తకం
- బ్యాంక్ పాస్‌బుక్
- ఆధార్ కార్డు
- దరఖాస్తు ఫారం
దరఖాస్తు చేసుకోవడం ఎలా
- మీ సేవా కేంద్రంలో దరఖాస్తును నమోదు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారంను పూర్తి చేసి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)లో సమర్పించాలి.
- అధికారుల ధ్రువీకరణ తరువాత చెరువులు తవ్వడం ప్రారంభించాలి.
- జియో-మెమ్‌బ్రేన్ షీట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
- ధ్రువీకరించిన తరువాత రూ.75 వేల సబ్సిడీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది.
ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా నీటి ఎద్దడి (కరువు పీడిత )ప్రాంతాలకు ఇది ఓ మాదిరి ఉపశమనం అనే చెప్పాలి ఎక్కడి నుండో పైపుల ద్వారా నీటిని సమకూర్చుకుని తిండి గింజలను మరియు ఉద్యాన వన పంటలను పండించుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశం అనే చెప్పాలి.ఈ పథకానికి సంబంధించి మరిన్ని విషయాలను దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సేవ ఆపరేటర్నిఅడిగి తెలుసుకోగలరు.