AP Arogya Sri Scheme Trust Services 2025: ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్య శ్రీ అమలు విధానంలో మార్పులు

Photo of author

By Admin

AP Arogya Sri Scheme Trust Services 2025: ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్య శ్రీ అమలు విధానంలో మార్పులు

ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్య శ్రీ అమలు విధానంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం..ఆరోగ్య శ్రీ పథకంలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ సంక్షేమ కార్యక్రమం పొరుగు రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. ఖరీదైన చికిత్సలు కూడా నిరుపేదలకు అందుబాటులోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకునే అతిగొప్ప సంక్షేమ కార్యక్రమం. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మంది పేదలకు కార్పొరేట్ వైద్యం అందింది. ఈ పథకం గొప్పదనాన్ని గుర్తించి తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆరోగ్య శ్రీని కొనసాగించాయి.ఈ పథకం కింద 3,257 చికిత్సలు అందిస్తున్నామని.. బీమా విధానంలోనూ ఈ చికిత్సలు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి బీమా విధానంలో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సేవలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఇదే విషయాన్ని వెల్లడించారు.ఈ చికిత్సలు కొనసాగుతాయని ఆరోగ్యశాఖ మంత్రి చెప్తున్నారు. ఇంకా అవసరమైతే చికిత్సల సంఖ్యను కూడా పెంచుతామని రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందించడం కొనసాగుతుందన్నారు.ప్రస్తుతం ఉన్న విధానానికి, బీమా విధానానికి తేడా ఏంటనేదీ గమనిస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులతో బాధపడేవారికి వైద్య చికిత్సలు అందించిన ఆస్పత్రులకు.. రోగుల తరుపున ప్రభుత్వం చెల్లింపులు చేసేది. బీమా విధానంలో ప్రభుత్వం ముందుగా ఎంపిక చేసిన కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలకు అర్హులైన ప్రజల తరుపున ప్రీమియం చెల్లిస్తుంది. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పుడు బీమా సంస్థలు.. ఆస్పత్రులకు చెల్లింపులు చేస్తాయి. ఈ విధానం ద్వారా రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఇబ్బందులు ఉండవని ఆరోగ్యశాఖ మంత్రి చెప్తున్నారు.

బీమా విధానం అమలు చేస్తే ఆరు గంటల్లోనే చికిత్సను ప్రారంభించేందుకు అనుమతి వస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పరిధిలో 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయని.. ప్రతి కుటుంబం తరుపున రూ.2500 వరకూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. అలాగే దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలవారికి బీమా వర్తింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సత్యకుమార్.

Leave a Comment