AOs Warning To Congress Government: డిజిటల్ క్రాప్ సర్వెలు చేయమని ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఏవోలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఈఓలు అయితే షాప్ ఇవ్వడం జరిగింది తాము డిజిటల్ క్రాప్ సర్వే చేయమని చెప్పడం జరిగింది.
తెలంగాణలో రోజురోజుకు రెవెన్యూ శాఖ ఇబ్బందులకు గురి అవుతూ ఉంది. ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఏఈవోలు దీనికి ఒప్పుకోవడం లేదు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటల్ క్రాప్ సర్వే చేయబోమని నేరుగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం..
శామీర్ పేట లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రంలో ఉన్న ఏఈవోలు అంత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని తమకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ సమస్యల్లో ఒకటిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేలు నిర్వహించాలని ఏ ఈ ఓ లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.డిజిటల్ క్రాప్ సర్వేకు వ్యతిరేకంగా అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్లు(ఏఈవో) గళమెత్తారు. అయితే తమకు ప్రొటెక్షన్ కల్పించాలని ప్రొటెక్షన్ లేకపోతే తాము ఈ డిజిటల్ క్రాప్ సర్వేను నిర్వహించబమని తెలిపారు. గతంలో సర్వే కోసం వెంట వీఆర్వోలు ఉన్నారని ఇప్పుడు విఆర్వోలు లేకుండా మేము ఒంటరిగా ఈ సర్వే చేయమని ఏ ఈ ఓ లు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఈవో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మేము ఉద్యోగంలో చేరిన గడిచిన 7 సంవత్సరాలలో అనేక వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రైతు బంధు, రైతు భీమా అమలు, రైతు వేదికల నిర్మాణాలు అమలు చేశామని గుర్తు చేశారు.ఇప్పుడు కూడా మేం ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్దమని, అయితే పంటల పరిశీలన సర్వేకు వెళ్ళే ఏఈవోలకు సహాయకులను, భద్రతను ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. గతంలో సర్వేలు జరిగినప్పుడు వీఆర్వో, వీఆర్ఏలు తమతో పాటు ఉండేవారని, ఇప్పుడు ఒంటరిగా వెళ్ళే క్రమంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ఏఈవోలలో అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఏఈవోలకు భద్రత కరువైందని , అందుకే డిజిటల్ క్రాప్ సర్వే చేయబోమని ప్రభుత్వానికి నివేదిస్తున్నామని తెలిపారు. సహాయకులను తోడుగా నియమిస్తే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తామని, తమ సమస్యలపై ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలన చేయాలని కోరారు.
మహిళలకు ఎలాంటి భద్రత కల్పించకుండా మేము ఈ సర్వేలో పాల్గొనమని ప్రతినిధులు తెలపడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వినతి అందించామని మాకు ప్రొడక్షన్ కల్పిస్తే మాత్రమే మేము ఈ సర్వేను నిర్వహిస్తామని లేక లేకుంటే మేము ఈ సర్వేను నిర్వహించబోమని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు మేము కట్టుబడి ఉన్నామని ప్రతి పథకాన్ని రైతుల వరకు తీసుకువెళ్తామని అన్నారు.దీంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఏఈఓ లో క్రాప్ సర్వే నిర్వహించకపోతే ఎవరు ఏ పంట వేశారు అనేది ప్రభుత్వానికి తెలియదు కాబట్టి నిధులు విడుదల ఇవ్వడం ఆలస్యం అవుతుంది.