Annadata Sukhibhava Amount Release Date
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.అన్నదాతలకు ఇస్తాన్న 20 వేళా రూపాయలను ఇవ్వడానికి సూపర్ సిక్స్ హామీలకు మార్గదర్శాకలను విడుదల చేసింది.
రైతులకు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం 20 వేళా రూపాయలను అందించడానికి ఇప్పటికే మార్గదర్శకాలను అమలు చేసింది.రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 20వేళా రూపాయలను అందించడానికి మార్గదర్శాకాలను విడుదల చేసింది.దీని ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందించటానికి ముందడుగు వేస్తోంది..ప్రభుత్వం జూన్ 12 నుండి ప్రతి ఒక్క రైతుకు 20 వేళా రూపాయలను నేరుగా రైతుల కాటలోకి విడుదల చేస్తాం అని తెలిపింది అన్నదాత సుఖీభవ పథకం తో పాటు తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తాం అని చెప్పారు.
అన్నదాత సుఖీభవ పథకం రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకం. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తారు. పిఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000, కేంద్రం PM కిసాన్ ద్వారా రూ.6.000 అందిస్తుంది. మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నారు.
- అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 ఏళ్లు నిండిన రైతులు మాత్రమే అర్హులు.
- ఈ పథకం లబ్ధి పొందడానికి భూమికి సంబంధించి పక్కా పత్రాలు ఉండాలి.
- భూమి యాజమాన్య పత్రాలు లేదా పట్టాదారు పాసుపుస్తకం తప్పనిసరిగా ఉండాలి.
- రైతు పేరు ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి.
- అలాగే ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి.
- రైతు పండించే పంటల వివరాలను అధికారుల వద్ద నమోదు చేయించాలి.
- అలాగే భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
- అయితే వారికి తప్పనిసరిగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు.
- మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ఫార్మర్స్ రిజిస్ట్రీలో నమోదు చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.