Indiramma Housing scheme beneficiary list
ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం బిల్లులు చెల్లించే ప్రక్రియలో జాప్యం జరగనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే లబ్ధిదారులకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలను సారం ఇందులో లబ్ధిదారులకు అందించే బిల్లుల ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసింది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
బిల్లు చెల్లింపుల్లో మార్పులు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని లింక్ చేయడం ద్వారా బిల్లు చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేయవలసి వచ్చిందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని దినాలని మరుగుదొడ్ల నిర్మాణాలతో సహా కేంద్ర ప్రభుత్వం సాంక్షన్ చేయడంతో ఈ బిల్లుల చెల్లింపుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులకు బిల్లులు చెల్లించే షెడ్యూల్లో మాత్రమే ఈ మార్పులు చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులను ఎగవేయమని ఐదు లక్షలు నిర్మాణానికి ఇవ్వడం జరుగుతుంది అని గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలిపారు.
మూడో దశలో మార్పులు
లబ్ధిదారులకు నిర్మాణానికి ఒకటో దశ రెండవ దశ లక్ష రూపాయలను అందిస్తామని మూడో దశలో మాత్రమే 1,40,000 అందిస్తాం అని మంత్రి అన్నారు. మిగిలిన డబ్బును కూడా త్వరలోనే అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మార్పు కి లబ్ధిదారులు సహకరించి పనులు జరపాలని ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని ఆయన అన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లపై ఎలాంటి సందేహాలు ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచామని ఆ 18005995991టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సందేహాలు తెలుసుకోవచ్చని అన్నారు.










