రోహిత్ ఫాన్స్ కు బాడ్ న్యూస్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ | Rohith sharma Said Good Bye to Test Cricket 2024

Rohith sharma Said Good Bye to Test Cricket
క్రికెట్ బెస్ట్ కెప్టెన్ ఐన ధోని తరువాత మల్లి అంతే రంగెలా ఎదిగిన ప్లేయర్ రోహిత్ శర్మ ఆయన ఇప్పుడు రెటైర్మ్బ్ట్ తీసుకుంటున్నట్టు ఇంస్టాగ్రామ్ అకౌంట్లో తెలియజేసారు
Rythu Prasthanam: భారత్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో రోహిత్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ విధంగా ఆ పోస్టులో రాసుకొచ్చాడు. “అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా దేశానికి టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. సంవత్సరాలుగా అందిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నేను వన్డే ఫార్మాట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాను” అని పేర్కొన్నాడు.రోహిత్ శర్మ మొత్తం 67 టెస్ట్ మ్యాచులు ఆడాడు. 4301 పరుగులు సాధించగా.. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాదడం విశేషం. అంతేకాదు.. టెస్ట్ కెరీర్‌లో ఒక డబల్ సెంచరీ (212) కూడా సాధించాడు.రోహిత్ ఫాన్స్ కు ఇది చాల బాడ్ న్యూస్ అనే చెప్పాలి

Leave a Comment