KTR said don’t buy a Kanche Gachibowli lands
ప్రతి ఒక్కరికి చెపుతున్న మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా రేవంత్ రెడ్డి అమ్ముతున్న భూముల్ని కొంటె మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం మళ్ళీ మమ్మల్ని అనొద్దు.
తెలంగానా రాష్ట్ర ప్రభుత్వం HcU లోని 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న ఏళ్ల నాటి చెట్లను కొట్టేసి చదును చేస్తున్న నేపధ్యంలో HcU విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనను తెలిపారు.దీంతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మినిస్టర్ అయినా కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనొద్దని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కోరారు. ఒకవేళ కొన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని చెప్పారు. భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన ఎకో పార్క్ గా తీర్చిదిద్ది HCUకి బహుమతిగా ఇస్తామన్నారు.మేము ముందే చెబుతున్నాం అని మళ్ళీ మాకు చెప్పలేదు అని అనకూడని ఆయన అన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమని పేర్కొన్నారు.